Mayanad People : మయనాడ్ బాధితుల కోసం కదిలి వచ్చిన మెగా హీరోలు.. చిరు చరణ్ కోటి.. అల్లు అర్జున్ పాతిక లక్షలు..!
ప్రధానాంశాలు:
Mayanad People : మయనాడ్ బాధితుల కోసం కదిలి వచ్చిన మెగా హీరోలు.. చిరు చరణ్ కోటి.. అల్లు అర్జున్ పాతిక లక్షలు..!
Mayanad People :దేశంలో భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి అక్కడ ఉన్న ఊళ్లకు ఊళ్లే నాశనం చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విళతాండవానికి ప్రజలు అచేతన పరిస్థితిలో ఉన్నారు. ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు. మయనాడ్ బాధితులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి.వయనాడ్ ప్రకృతి బీభత్సం అక్కడ ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యేలా చేసింది. అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగీనప్పుడు సినీ సెలబ్రిటీస్ కూడా తమ సహాయాన్ని అందిస్తారు. మయనాడ్ లోని బాధితుల కోసం భారీ విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తీలు కలిసి మొత్తం 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. కేరళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా 10 లక్షలు మలయాళ స్టార్ ముమ్మట్టి 15 లక్షలు తమిళ పరిశ్రమ నుంచి కమల్ హాసన్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
Mayanad People చిరు, చరణ్, అల్లు అర్జున్ గొప్ప మనసు..
హీరోయిన్ రష్మిక మందన్న కూడా 10 లక్షల విరాళం ప్రకటించింది. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ కలిసి మయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల సాయాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి సాయం అందిస్తున్నట్టుగా చిరంజీవి తన ట్విట్టర్ లో ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా మయనాడ్ బాధితుల కోసం 25 లక్షల సాయం అందించారు.

Mayanad People : మయనాడ్ బాధితుల కోసం కదిలి వచ్చిన మెగా హీరోలు.. చిరు చరణ్ కోటి.. అల్లు అర్జున్ పాతిక లక్షలు..!
ప్రకృతి విప్పతులు సంభవించినప్పుడు ప్రజలకు సాయంగా మేమున్నాం అంటూ ముందుకొస్తారు సిని సెలబ్రిటీలు. మయనాడ్ కొండ చరియలు విరిగి జీవితాలు కోల్పోయిన వారికి.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి అందిస్తూ సినీ సెలబ్రిటీస్ తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. చిరంజీవి, చరణ్ కలిసి కోటి రూపాయలు మయనాడ్ బాధితులకు సహాయ సహకారాల కోసం సీఎం ఫండ్ కి అందించారు.