Vijay Devarakonda : మైక్ టైస‌న్ బండ బూతులు తిట్టాడు.. అవి చెప్ప‌లేనంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Authored By Sam C | The Telugu News | Published on: August 29, 2022, 3:20 pm

Vijay Devarakonda : అర్జున్ రెడ్డితో టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ త‌ర్వాత మాత్రం వ‌రుస ఫ్లాపుల‌తో క్రేజ్ త‌గ్గించుకుంటున్నాడు. తాజాగా వ‌చ్చిన లైగ‌ర్ చిత్రంతో విజ‌య్ గ‌ట్టి హిట్ కొడ‌తాడ‌ని అంద‌రు భావించారు. కాని ఈ చిత్రం కూడా విజ‌య్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా అభిమానులను నిరాశరపరచడం తెలిసిందే. ఈ నెల 25న లైగర్ సినిమా విడుదలైంది. మొదటి రోజు 33.12 కోట్లను ఈ సినిమా వసూలు చేసుకోగలిగింది. రెండో రోజుకు వచ్చే సరికి కలెక్షన్లు రూ.27 కోట్లకు తగ్గాయి. ఇక ముచ్చటగా మూడో రోజు కేవలం రూ.7.5 కోట్లనే వసూలు చేసుకుంది. రాను రాను క‌లెక్ష‌న్స్ త‌గ్గుతూ వ‌స్తున్నాయి.

Vijay Devarakonda : ఎందుకు తిట్టారు..

ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న మైక్ టైసన్ లైగ‌ర్ చిత్రంలో న‌టించడం విశేషం. లైగర్ మూవీకి భారీ హైప్ ఏర్పడడంలో ఇది కూడా ఓ కారణం. రియల్ ఫైట్స్ లో ఛాంపియన్స్ ని మట్టికరిపించిన మైక్ తో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైట్ చేశారు. కాగా లైగర్ మూవీ సెట్స్ లో మైక్ టైసన్ తనను తిట్టినట్లు విజయ్ దేవరకొండ తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని బయటపెట్టారు. షూటింగ్ సమయంలో చాలాసార్లు విజయ్ దేవరకొండ నన్ను తిట్టారు. అవి ఎలాంటి బూతులో నేను చెప్పను. అయితే ఆయన ప్రేమపూర్వకంగా తిట్టడం జరిగింది. అందుకే నేను చెప్పదల్చుకోవడం లేదన్నాడు.

Mike Tyson Scolded Vijay Devarakonda In Shooting

Mike Tyson Scolded Vijay Devarakonda In Shooting

మైక్ టైస‌న్ ఇక్క‌డి మ్యూజిక్ , ఫుడ్ ఇష్ట‌ప‌డ‌తార‌ని టైస‌న్ అన్నాడు. గతంలో మైక్ టైసన్ ఓసారి ఇండియాకు రాగా తనను చూడడానికి జనాలు పెద్ద ఎత్తున వచ్చారట. వాళ్ళను చూసి భయంతో హోటల్ గదిలోకి వెళ్లిపోయానని టైసన్ చెప్పాడట. విజయ్ దేవరకొండ టైసన్ గురించి చేసిన ఈ కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్. అనన్యాపాండే హీరోయిన్‌గా నటించింది. మొదటిరోజే ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. దీంతో సినిమా చూసిన ప్రతీ ఒకరు నిరాశ వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సినిమా ప్లాప్ అంటూ ట్రెండ్ కూడా అయ్యింది

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp