Minister Roja : ఎవరొచ్చినా సరే పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం… మంత్రి రోజా…!
ప్రధానాంశాలు:
Minister Roja : ఎవరొచ్చినా సరే పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం... మంత్రి రోజా...!
Minister Roja : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతూ వస్తున్నాయి. ఎన్నికలకు మరి కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండడంతో సమయం వృధా చేయకుండా రాజకీయ నేతలు ప్రచారాలు చేపడుతూ వస్తున్నారు. ఇక ఈ ప్రచారాలలో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం జనసేన పార్టీ ప్రచారాలలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ప్రచారాలలో పాల్గొనగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు తరఫున మద్దతు ప్రకటిస్తూ వీడియోను షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
ఇదిలా ఉండగా వైసీపీ పార్టీ నేతలు మాత్రం జనసేన తరఫున ఎంతమంది కలిసి వచ్చిన సరే తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా కూటమిలో భాగంగా మూడు పార్టీలు కలిసి వస్తున్న తీరును వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు జనసేన మరియు బీజేపీ పార్టీలను వాడుకుంటున్నారని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడిన వైసీపీ మంత్రి రోజా జనసేన పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ…జనసేన పార్టీ కి మొదట్లో 24 సీట్లు అన్నారు, గాయత్రి మంత్రం అన్నారు, ఇక ఇప్పుడు 21 సీట్లతో సర్దుకున్నారు. మరి త్రివిక్రమ్ ఇంకా డైలాగులు రాసిచ్చినట్లుగా లేరు అందుకే దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఇక జనసేనకి ఇచ్చిన 21 సీట్లలో కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఉన్నారు. మిగిలినవారు మెజారిటీ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన వారే ఉన్నారు.
అంటే పవన్ కళ్యాణ్ వెనుక స్పష్టంగా ఒక్క నాయకుడు కూడా లేడని అర్థమవుతుందంటూ రోజా తెలియజేశారు. ఆ పార్టీలో మిగిలిన చెత్త ఈ పార్టీల మిగిలిన చెత్తను ఏరుకొని క్యాండిడేట్లను ఎంపిక చేసే దౌర్భాగ్య స్థితిలో జనసేన పార్టీ ఉందని ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా రోజా తెలిపారు. అంతేకాక ఈరోజు సీట్ల పంపకాలలో కూడా మనం గమనించినట్లయితే ఎవరెవరికి ఏమిచ్చారు అనేది పూర్తిగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీ ని జనసేనని మోసం చేయాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఇలా చేశారని తెలిపారు. ఇక బీజేపీ కి మరియు జనసేనకు ఇచ్చిన సీట్లలో కూడా చంద్రాబాబు తన అభ్యర్థులను ఎలా పంపించి పెట్టాడు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం కూటమిలో ఒకరికి ఒకరికి పడకపోవడంతో మొత్తం కూటమి సున్నా అవుతుందని ఈ సందర్భంగా రోజా తెలియజేశారు