Mohan Babu : ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణరావు శిష్యుడు చిరంజీవి..? మోహన్ బాబు..?
Mohan Babu : తాను మరణించేంత వరకు సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా, సాయం చేయాలని ఎవరు వచ్చి తలుపు తట్టినా తానున్నాను అని భరోసా ఇచ్చారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆయన చనిపోయిన తర్వాత చిత్ర పరిశ్రమలో సినీ పెద్దగా ఉండాల్సిన స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినీ పెద్ద స్థానంలో మోహన్ బాబు కూర్చోవాలని ప్రయత్నిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం సాగుతున్నది.
Mohan Babu : టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో దాసరి..!
సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు తర్వాత ఆయన స్థానాన్ని రిప్లేస్ చేసేవారు ఎవరు లేరని అందరు అంటుంటారు. అయితే, కొంత కాలం పాటు మెగాస్టార్ చిరంజీవి దాసరి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగలడని పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే చెప్పారు. ఈ క్రమంలోనే సినీ పెద్దగా చిరంజీవి సైతం సినిమా పరిశ్రమ కష్టాలను గురించి ప్రభుత్వాలకు విన్నపాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్, అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక అయిన క్రమంలో సినిమా పరిశ్రమకు పెద్దగా మోహన్ బాబు ఉండాలని ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినబడుతున్నాయి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మోహన్ బాబు వ్యవహరిస్తారని చర్చ కూడా నడుస్తున్నది.
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో మోహన్ బాబు, మంచు విష్ణు ఆర్టిస్టుల సంక్షేమం కోసం పాటు పడుతారని పలువురు ఆకాంక్షిస్తున్నారు. సీనియర్ హీరో, మా మాజీ అధ్యక్షుడు నరేశ్ గతంలోనే మరో దాసరి మోహన్ బాబు అనే రీతిలో మాట్లాడారు కూడా. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మరో దాసరి అవుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంగతులు పక్కనబెడితే.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు మాత్రం మోహన్ బాబుపై పలు ఆరోపణలు చేశారు. మోహన్ బాబు ‘మా’ ఎన్నికల సందర్భంగా రౌడీయిజం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్టిస్టులు మోహన్ బాబును సినీ పెద్దగా అంగీకరించగలరా? అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దాసరి తర్వాత సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉంటారని చాలా మంది అన్నారు. అయితే, అటువంటి స్థానం తాను తీసుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపలేదని అంటుంటారు.