Mohan Babu : నటుడిగా సత్తా చాటిన మోహన్ బాబు రాజకీయాల్లోను అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కాని పెద్దగా సక్సెస్ కాలేదు.రాజకీయంగా వైసీపీతో కలిసిన ఆయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కొత్త లెక్కలకు దారి తీస్తున్నాయి. తాను బీజేపీ మనిషినని.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరినని…తాను రియల్ హీరోని… అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన మోహన్ బాబు ఆ పార్టీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేసారు. జగన్ సీఎం అవ్వాలంటూ ప్రచారంలో పదే పదే చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే..
మోహన్ బాబు టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత ఫిలిం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారనే వాదన వినిపించింది. కానీ, ఎటువంటి పదవులు దక్క లేదు. దీంతో మోహన్ బాబు వైసీపీకి దూరంగా ఉంటూ బీజేపీకి దగ్గర అవుతున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఎన్నికలకోడ్ ఉల్లంఘన వ్యవహారంలో సినీ నటుడు మోహన్ బాబు కేసు విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు , మనోజ్ తో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. తిరుపతి ఎన్టీఆర్ సెంటర్ నుంచి వారు పాదయాత్రగా వెళ్లి కోర్టుకు హాజరయ్యారు.
అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ కోర్టు సమన్లు తనకు అందలేదని, అయినా న్యాయాధిపతి రమ్మని పిలిచారని.. ఆయన సమక్షంలో సమన్లపై సంతకం చేశానన్నారు. నిజం చెప్పాలంటే.. ‘పిలిచారు.. వచ్చాను.. చూశాను.. సంతకం పెట్టాము.. బయలుదేరుతున్నాము.’ అందరికి నమస్కారం అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22వ తేదీన తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్, విద్యానికేతన్ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో కోర్ట్‌కి హాజరయ్యారు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.