Mohan Babu : మొన్న‌టి వ‌రకు వైసీపీ అన్న మోహ‌న్ బాబు.. ఇప్పుడు బీజేపీ మ‌నిషిని అంటాడేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mohan Babu : మొన్న‌టి వ‌రకు వైసీపీ అన్న మోహ‌న్ బాబు.. ఇప్పుడు బీజేపీ మ‌నిషిని అంటాడేంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :28 June 2022,4:32 pm

Mohan Babu : న‌టుడిగా స‌త్తా చాటిన మోహ‌న్ బాబు రాజ‌కీయాల్లోను అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. కాని పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.రాజకీయంగా వైసీపీతో కలిసిన ఆయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కొత్త లెక్కలకు దారి తీస్తున్నాయి. తాను బీజేపీ మనిషినని.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరినని…తాను రియల్‌ హీరోని… అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన మోహన్ బాబు ఆ పార్టీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేసారు. జగన్ సీఎం అవ్వాలంటూ ప్రచారంలో పదే పదే చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే..

మోహన్ బాబు టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత ఫిలిం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారనే వాదన వినిపించింది. కానీ, ఎటువంటి పదవులు దక్క లేదు. దీంతో మోహ‌న్ బాబు వైసీపీకి దూరంగా ఉంటూ బీజేపీకి ద‌గ్గ‌ర అవుతున్నారు. అయితే తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్యలు చర్చ‌నీయాంశంగా మారాయి. కాగా, ఎన్నికలకోడ్ ఉల్లంఘన వ్యవహారంలో సినీ నటుడు మోహన్ బాబు కేసు విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు , మనోజ్ తో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. తిరుపతి ఎన్టీఆర్ సెంటర్ నుంచి వారు పాదయాత్రగా వెళ్లి కోర్టుకు హాజరయ్యారు.

mohan babu close to bjp

mohan babu close to bjp

Mohan Babu : బీజేపీ మ‌నిషి..

అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ కోర్టు సమన్లు తనకు అందలేదని, అయినా న్యాయాధిపతి రమ్మని పిలిచారని.. ఆయన సమక్షంలో సమన్లపై సంతకం చేశానన్నారు. నిజం చెప్పాలంటే.. ‘పిలిచారు.. వచ్చాను.. చూశాను.. సంతకం పెట్టాము.. బయలుదేరుతున్నాము.’ అందరికి నమస్కారం అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని 2019 మార్చి 22వ తేదీన తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్‌, విద్యానికేతన్‌ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో కేసు న‌మోదైంది. ఈ క్ర‌మంలో కోర్ట్‌కి హాజ‌ర‌య్యారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది