Mohan babu : నీకు చేత‌కాక‌పోతే నేను చూసుకుంటా.. చిరంజీవికి కౌంట‌ర్ ఇచ్చిన మోహ‌న్‌బాబు..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 2 January 2022, 7:41 pm

Mohan babu : ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల వివాదం రోజురోజుకీ ముదిరి పోతోంది. ఈ వివాదానికి సంబంధించి నటుడు మోహన్ బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇండస్ట్రీలో నేను ప్రతి వ్యవహారంలో పెద్దగా ఉండను.. పెద్దరికం అసలే ప్రదర్శించను అంటూ అంతటితో ఆగక ఇద్దరు కొట్టుకుంటుంటే పంచాయతీలు చేయను అంటూ మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు చేసిన కాసేపటికే మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా ఈ వివాదంపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు. తన మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదని ఆయన అన్నారు. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదంటూ.. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు. కలిసి సినిమాను బతికిద్దాం అంటూ మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Mohan babu comments on Chiranjeevi

Mohan babu comments on Chiranjeevi

ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు ఏకంగా ఏపీ మంత్రులతో ఈ విషయంపై చర్చలు కూడా జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరూ కూడా టికెట్ రేట్స్ గురించి మాట్లాడొద్దని దిల్ రాజు బహిరంగంగానే చెప్పారు. అయితే మోహన్ బాబు మాత్రం సోషల్ మీడియా వేదికగా సీఎం కు అందజేస్తానని చెబుతూ షేర్ చేసిన ఓ లేఖ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి