Mohan Babu : స్టేజ్ పై లైవ్ లో స్టార్‌ ను కామన్‌ సెన్స్ లేదంటూ తిట్టిన మోహన్‌ బాబు

Authored By Himanshi | The Telugu News | Published on: February 13, 2022, 4:30 pm

Mohan Babu  : మోహన్ బాబు ఏ విషయం అయినా మొహం మీదే మాట్లాడేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు మరియు ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. తాను ఎక్కడ ఉన్నాను.. ఎవరితో ఉన్నాను.. ఏ స్టేజిపై ఉన్నాను అనే విషయాలను కూడా పట్టించుకోకుండా మోహన్ బాబు చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు విమర్శల పాలవుతునే ఉంటాయి. ఆ వ్యాఖ్యలు విమర్శల పాలు అవ్వడంతో పాటు ఆయన తీరును కూడా జనాలకు తెలియజేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే కోపం నీ దాచుకున్న వాడే గొప్పవాడు అవుతాడు. ఆ కోపం ని అప్పటికప్పుడు ప్రదర్శించడం కంటే కాస్త గ్యాప్ ఇచ్చి మరో చోట ప్రదర్శించడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు ఉంటాయని.. ఎన్నో సమస్యలు ఆరంభం కాకుండానే ఉంటాయని పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.

మోహన్ బాబు పలు విషయాలలో అప్పటికప్పుడు స్పందించడం వల్ల చాలా సార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతున్నాడు ఆ సమయంలో అలీ జేబులో నుండి ఫోన్ తీసి చూశాడు. ఏదో ఫోన్ రావడంతో దాన్ని కట్ చేయడం కోసం ఫోన్ ను బయటకు తీశాడు అంతే కానీ ఫోన్ మాట్లాడింది కూడా లేదు. అయినా కూడా మోహన్ బాబు ఏకంగా స్టేజిపై ఉండి ఫోన్ మాట్లాడుతున్నావు కామన్ సెన్స్ ఉందా నీకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతోటి దానికి కామన్ సెన్స్ ఉందా అంటూ అంత పెద్ద మాట వాడాల్సిన అవసరం లేదు. అందరి ముందు తన స్థాయి నటుడైనా అలీని అలా మాట్లాడిన మోహన్ బాబు కే కామన్సెన్స్ లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

mohan babu Serious comments on comedian ali

mohan babu Serious comments on comedian ali

మోహన్ బాబు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు పలు సందర్భాల్లో చేశాడు. అందుకు ఆయనకు విమర్శలు తప్పలేదు. అయినా కూడా మళ్లీ అదే పద్ధతిని మోహన్ బాబు కొనసాగించడం ఈ విమర్శలకు తెర తీస్తోంది. అదే గొప్ప విషయం అన్నట్లుగా ఆయనకు ఆయన చెప్పుకుంటాడు. మొహం మీదే మాట్లాడేస్తాను. నేను ఏ విషయాన్ని కూడా దాచుకోను అంటూ గొప్పగా చెబుతాడు. స్టేజ్ పై లైవ్లో మోహన్ బాబు కామన్ సెన్స్ ఉందా అంటూ చేసిన వ్యాఖ్యలు అలీకి తీవ్రంగా ఇబ్బంది కలిగి ఉంటే ఉంటాయి. అందుకే అలీ ఆ సమయంలో వెంటనే మొహం మార్చేశాడు. దాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించినా కూడా మోహన్ బాబు మళ్లీ మళ్లీ పరువు తీసే అలాగే మాట్లాడాడు. ఇలాగే జరిగితే ముందు ముందు మోహన్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు కనీసం స్టేజ్‌ కూడా షేర్ చేసుకోరు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మంచు ఫ్యామిలీకి ఉన్న గోరోజనం కాస్త తగ్గించి ఉంటే బెటర్ అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp