
Monal gajjar : అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన గుజరాతీ సోయగం మోనాల్ గజ్జర్. అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్ అంటే సినిమా చూసినంత సేపే తప్ప ఆ తర్వాత ఎవరికీ గుర్తుండదు. మోనాల్ గజ్జర్ ని కూడా మన వాళ్ళు అలాగే మర్చిపోయారు. ఇక ఇక్కడ కనిపించకుండా తన సొంత భాషలో సినిమాలు చేసుకుంటూ అక్కడ పాపులారిటీని సంపాదించుకుంది. ఆ పాపులారిటీతోనే గత ఏడాది బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొని దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. షో సాగినన్ని రోజులు విమర్శలు ఎదుర్కొన్నప్పటికి బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఈమెని వదల్లేదు.
monal-gajjar-purchased a house
మొత్తానికి బిగ్ బాస్ వల్ల మోనాల్ కి విపరీతమైన పేరొచ్చింది. దాంతో ఇక్కడ ఐటెం సాంగ్స్ లో బుల్లితెర మీద సందడి చేస్తోంది. అయితే ఇక్కడ ఓ ఇల్లు కొనుక్కోవాలని మోనాల్ కి ఎప్పటి నుంచో పెద్ద కోరిక ఉండేదట. తెలుగులో అప్పుడు సరైన అవకాశాలు లేకపోవడంతో కుదరలేదు. ఎట్టకేలకి ఆ కోరిక ఇప్పుడు తీర్చుకుంది. ఇక్కడ సంపాదిస్తున్న డబ్బుతో మోనాల్ ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించి. ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనే నా కల ఇప్పుడు నెరవేరిందని తెలిపింది.
అంటే మోనల్ గజ్జర్ పూర్తి ఫోకస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదే పెట్టినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతానికి అమ్మడికి సినిమా అవకాశాలైతే లేవు గానీ ఓ షోలో మాత్రం సందడి చేస్తోంది. ఇక తను తాజాగా కొన్న ఇంటి విలువ దాదాపు 5కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంత మొత్తం పెట్టి మోనాల్ ఇల్లు కొనడానికి ఎన్ని పెద్ద సినిమాలు చేసిందబ్బా..అని కొంతమంది ఆరా తీస్తున్నారట. ఎక్కడా పెద్దగా షాప్ ఓపెనింగ్స్, వరుసగా ఐటెం సాంగ్స్ కూడా చేసింది లేదు. ఇంత ఖరీదైన ఇల్లు కొందంటే గ్రేటే అని మాట్లాడుకుంటున్నారట. ఎవరెన్ని మాట్లాడుకున్నా ఈ గుజరాతీ ముద్దుగుమ్మ మాత్రం హైదరాబాద్ లో ఓ ఇంటిదైంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.