Monal gajjar : హైదరాబాద్‌లో ఇల్లుకొన్న మోనాల్ గజ్జర్..ఎన్ని కోట్లుంటుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monal gajjar : హైదరాబాద్‌లో ఇల్లుకొన్న మోనాల్ గజ్జర్..ఎన్ని కోట్లుంటుందో తెలుసా..?

 Authored By govind | The Telugu News | Updated on :28 June 2021,9:00 am

Monal gajjar : అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన గుజరాతీ సోయగం మోనాల్ గజ్జర్. అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్ అంటే సినిమా చూసినంత సేపే తప్ప ఆ తర్వాత ఎవరికీ గుర్తుండదు. మోనాల్ గజ్జర్ ని కూడా మన వాళ్ళు అలాగే మర్చిపోయారు. ఇక ఇక్కడ కనిపించకుండా తన సొంత భాషలో సినిమాలు చేసుకుంటూ అక్కడ పాపులారిటీని సంపాదించుకుంది. ఆ పాపులారిటీతోనే గత ఏడాది బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొని దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. షో సాగినన్ని రోజులు విమర్శలు ఎదుర్కొన్నప్పటికి బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఈమెని వదల్లేదు.

monal gajjar purchased a house

monal-gajjar-purchased a house

మొత్తానికి బిగ్ బాస్ వల్ల మోనాల్ కి విపరీతమైన పేరొచ్చింది. దాంతో ఇక్కడ ఐటెం సాంగ్స్ లో బుల్లితెర మీద సందడి చేస్తోంది. అయితే ఇక్కడ ఓ ఇల్లు కొనుక్కోవాలని మోనాల్ కి ఎప్పటి నుంచో పెద్ద కోరిక ఉండేదట. తెలుగులో అప్పుడు సరైన అవకాశాలు లేకపోవడంతో కుదరలేదు. ఎట్టకేలకి ఆ కోరిక ఇప్పుడు తీర్చుకుంది. ఇక్కడ సంపాదిస్తున్న డబ్బుతో మోనాల్ ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించి. ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనే నా కల ఇప్పుడు నెరవేరిందని తెలిపింది.

Monal gajjar : ఇంటి విలువ దాదాపు 5కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

అంటే మోనల్ గజ్జర్ పూర్తి ఫోకస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదే పెట్టినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతానికి అమ్మడికి సినిమా అవకాశాలైతే లేవు గానీ ఓ షోలో మాత్రం సందడి చేస్తోంది. ఇక తను తాజాగా కొన్న ఇంటి విలువ దాదాపు 5కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంత మొత్తం పెట్టి మోనాల్ ఇల్లు కొనడానికి ఎన్ని పెద్ద సినిమాలు చేసిందబ్బా..అని కొంతమంది ఆరా తీస్తున్నారట. ఎక్కడా పెద్దగా షాప్ ఓపెనింగ్స్, వరుసగా ఐటెం సాంగ్స్ కూడా చేసింది లేదు. ఇంత ఖరీదైన ఇల్లు కొందంటే గ్రేటే అని మాట్లాడుకుంటున్నారట. ఎవరెన్ని మాట్లాడుకున్నా ఈ గుజరాతీ ముద్దుగుమ్మ మాత్రం హైదరాబాద్ లో ఓ ఇంటిదైంది.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది