Mrunal Thakur : బాలీవుడ్ లో ఓ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం సినిమాతో కుర్రకారు హృదయాన్ని దోచేసిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇందులో సీతగా తన నటనతో అదరగొట్టింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది మృణాల్‌కి ఫిదా అయిపోయారు. ఇక ఇటీవల హాయ్ నాన్న అనే సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఇక ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్‌తో పలకరించబోతుంది. ఈ సినిమాకు గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్టర్ గా వ్వవహిరిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
చిత్రంలో దివ్యాంశ కౌశిక్, అజయ్ ఘోష్, వాసుకి కీలక పాత్రల్లో నటిస్తుండగా రష్మిక మందన్నా ఓ పాటలో కనిపించనుందని సమాచారం. మరోవైపు చిత్రంలో విదేశి బ్యూటీ ‘మరిస్సా రోజ్ గార్డన్’ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు.మూవీ రిలీజ్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు తెలియజేసింది. సెలబ్రిటీలుగా ఉండటం వల్ల వచ్చే లాభనష్టాలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం ప్రేమిస్తుందన్న మృణాల్… వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చని తెలియజేసింది. వర్క్‌లో భాగంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు నాక్కూడా ఒక సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుందని చెప్పుకొచ్చంది. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని, పిల్లలను కని, డిన్నర్ కోసం రెస్టారంట్‌కు వెళ్లి రావాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. తాను చనిపోతే కుటుంబం ఎమైపోతుందా అనే భయం నాలో ఉందని కూడా తెలియజేసింది ముద్దుగుమ్మ. నటిగా కెరీర్ ఆరంభించిన సమయంలో భారీ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం వచ్చిందని.. అయితే కొన్ని కారణాల వల్ల అది చేజారీ పోయినట్లు మృణాల్ ఠాకూర్ తెలియజేసింది.
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
This website uses cookies.