Mrunal Thakur : సీతారామం బ్యూటీ పెళ్లి కాకుండా ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌నాలంటుందేంటి.. ఏం జ‌రుగుతుంది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mrunal Thakur : సీతారామం బ్యూటీ పెళ్లి కాకుండా ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌నాలంటుందేంటి.. ఏం జ‌రుగుతుంది..!

Mrunal Thakur : బాలీవుడ్ లో ఓ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం సినిమాతో కుర్రకారు హృదయాన్ని దోచేసిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇందులో సీత‌గా త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. ఈ సినిమా త‌ర్వాత టాలీవుడ్ ప్రేక్ష‌కులు చాలా మంది మృణాల్‌కి ఫిదా అయిపోయారు. ఇక ఇటీవ‌ల హాయ్ నాన్న అనే సినిమాతో కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఇక ఏప్రిల్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2024,2:00 pm

Mrunal Thakur : బాలీవుడ్ లో ఓ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం సినిమాతో కుర్రకారు హృదయాన్ని దోచేసిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇందులో సీత‌గా త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. ఈ సినిమా త‌ర్వాత టాలీవుడ్ ప్రేక్ష‌కులు చాలా మంది మృణాల్‌కి ఫిదా అయిపోయారు. ఇక ఇటీవ‌ల హాయ్ నాన్న అనే సినిమాతో కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఇక ఏప్రిల్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ ఫ్యామిలీ స్టార్‌తో ప‌ల‌క‌రించ‌బోతుంది. ఈ సినిమాకు గీతా గోవిందం దర్శకుడు ప‌ర‌శురామ్ డైరెక్టర్ గా వ్వవహిరిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Mrunal Thakur మృణాల్ ఠాకూర్ తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌, అజయ్‌ ఘోష్‌, వాసుకి కీలక పాత్రల్లో నటిస్తుండగా రష్మిక మందన్నా ఓ పాటలో కనిపించనుందని స‌మాచారం. మ‌రోవైపు చిత్రంలో విదేశి బ్యూటీ ‘మరిస్సా రోజ్ గార్డన్’ ముఖ్య పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు దీనిని నిర్మిస్తున్నారు.మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోషన్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు తెలియజేసింది. సెలబ్రిటీలుగా ఉండటం వల్ల వచ్చే లాభనష్టాలపై మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం ప్రేమిస్తుందన్న మృణాల్… వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చని తెలియ‌జేసింది. వర్క్‌లో భాగంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వ‌స్తుంది. కొన్నిసార్లు నాక్కూడా ఒక సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుందని చెప్పుకొచ్చంది. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని, పిల్లలను కని, డిన్నర్‌ కోసం రెస్టారంట్‌కు వెళ్లి రావాల‌ని ఉందంటూ మ‌న‌సులో మాట చెప్పింది. తాను చ‌నిపోతే కుటుంబం ఎమైపోతుందా అనే భ‌యం నాలో ఉంద‌ని కూడా తెలియ‌జేసింది ముద్దుగుమ్మ‌. నటిగా కెరీర్‌ ఆరంభించిన సమయంలో భారీ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం వచ్చిందని.. అయితే కొన్ని కారణాల వల్ల అది చేజారీ పోయినట్లు మృణాల్ ఠాకూర్ తెలియ‌జేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది