Mrunal Thakur : సీతారామం హీరోయిన్ మాముల్ది కాదు.. ఎన్టీఆర్‌ని బుట్ట‌లో ప‌డేసే ప్లాన్ వేస్తుందా ఏమి?

Authored By Sam C | The Telugu News | Published on: August 16, 2022, 6:40 pm

Mrunal Thakur : టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి కుర్ర భామ‌ల సంద‌డి మాములుగా ఉండదు.ఇటీవ‌ల‌ సీతారామం సినిమాతో ప‌రిచ‌యం అయింది మృణాల్ ఠాకూర్. సీతారామం మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో అమ్మ‌డి పేరు మారు మ్రోగి పోతుంది. ఇటీవ‌ల మృణాల్‌పై త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేశాడు నాగార్జున‌. సీతారామంలో సీతా మహాలక్ష్మీ రోల్ చేసిన మృణాల్‌ను చూసి ప్రేమలో పడ్డా. అమలతో కలిసి ఈ సినిమా చూస్తూ ఎవరీ ఈ అమ్మాయి.. ఇంత అందంగా ఉందని పదే పదే అడిగా అని నాగార్జున చెప్పడం విశేషం.సీత పాత్రలో మృణాల్‌ను చూపించిన విధానం అద్బుతంగా ఉందని, సీత పాత్రకు వాడిన దుస్తులు చాలా బాగున్నాయని నాగ్ అన్నారు.

Mrunal Thakur : మృణాల్ స్ట‌న్నింగ్ కామెంట్స్..

ఒక్క సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేసాయి. ఈ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలు ప్రభాస్ – మహేష్ – ఎన్టీఆర్ లలో మీకు ఎవరితో ? నటించాల‌ని ఉందన్న ప్రశ్నకు ఆమె ఆలోచించకుండా వెంటనే తనకు ఎన్టీఆర్‌తో చేయాలని ఉందని టక్కున చెప్పేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఎన్టీఆర్‌పై త‌న ఇష్టాన్ని చూపించిన మృణాల్ పెద్ద స్కెచ్ వేసిందే అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ అమ్మ‌డికి రానున్న రోజుల‌లో ఎన్టీఆర్ స‌ర‌స‌న అవ‌కాశం వ‌చ్చిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదని కొంద‌రు అంటున్నారు.

Mrunal Thakur Interesting Comments On Ntr 

Mrunal Thakur Interesting Comments On Ntr

వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన సీతారామం సినిమాలో విశాల్ చంద్ర శేఖర్ కంపోజ్ చేసిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ సక్సెస్ బాటలో పయనిస్తోంది. ఈ సినిమా థియేటర్స్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 115, సీడెడ్ – 50, ఆంధ్ర – 185. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లో విడుదలవుతోంది. వీటికి తోడు కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 థియేటర్స్, ఇతర భాషలు – 180, ఓవర్సీస్‌లో 250 పైగా థియేటర్స్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 860+ థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp