Pushpa 2 : పుష్ప 2 కోసం అల్లు అర్జున్‌ 125 కోట్ల పారితోషికంపై మైత్రి వారు ఏమన్నారంటే..!

Authored By aruna | The Telugu News | Published on: August 2, 2022, 8:00 pm

Pushpa 2 : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ లో సాధించిన వంద కోట్లతో కలిపి మొత్తంగా దాదాపుగా 350 కోట్ల రూపాయల వరకు పుష్ప సినిమా రాబట్టింది అనేది ఇండస్ట్రీ బాక్సాఫీస్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. పుష్ప 1 ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో సహజంగానే పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా పుష్ప 2 ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుకుమార్‌ చాలా సమయం తీసుకుని మరీ స్క్రిప్ట్‌ వర్క్ చేస్తున్నాడు.

ఈ సమయంలో పుష్ప 2 కు అల్లు అర్జున్‌ పారితోషికం 125 కోట్లు అంటూ ప్రచారం మొదలు అయ్యింది. పుష్ప 1 సినిమా కు గాను బన్నీ 40 కోట్ల పారితోషికం తీసుకుని లాభాల నుండి వాటాను తీసుకున్నాడ. దాంతో బన్నీకి పుష్ప 1 ద్వారా దాదాపుగా 60 కోట్ల వరకు వచ్చి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా లో పారితోషికం ఉంటుంది. అంటే 40 నుండి 50 కోట్ల వరకు పారితోషికం గా తీసుకుని ఆ తర్వాత లాభాల్లో వాటాగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప 125 కోట్ల పారితోషికం అనేది ఏమాత్రం నిజం కాదని మైత్రి వర్గాల వారి ద్వారా మాకు సమాచారం అందింది.

Mytri movie makers about Bunny 125 crore remuneration for Pushpa 2

Mytri movie makers about Bunny 125 crore remuneration for Pushpa 2

ఇప్పటి వరకు పుష్ప 2 కు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం కాలేదు.. ఈ సమయంలో ఆయన పారితోషికం గురించి మీడియాలో వార్తలు రావడం విడ్డూరంగా ఉందంటూ మైత్రి వారు అంటున్నారు. సినిమా మొదట్లోనే పుష్ప పారితోషికం గురించి మాట్లాడుకోవడం జరిగింది. పుష్ప 1 హిట్‌ అయ్యిందని.. 2 కు భారీ పారితోషికం ఇవ్వడం ఉండదు. లాభాల్లో వాటా మరియు నామినల్ రెమ్యూనరేషన్ మాత్రమే అల్లు అర్జున్‌ పుష్ప 2 కి కూడా తీసుకోబోతున్నాడు అంటూ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ కు చెందిన వారు అనధికారికంగా చెప్పారు. ఇదే సమయంలో పుష్ప 2 షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు క్లారిటీ ఇచ్చారు.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp