Mahanati Child Artist : మహానటిలోని చిన్నప్పటి సావిత్రి ఇప్పుడు ఇంత బబ్లీగా మారింది.. కళ్లు తిప్పుకోలేరు..!
ప్రధానాంశాలు:
Mahanati Child Artist : మహానటిలోని చిన్నప్పటి సావిత్రి ఇప్పుడు ఇంత బబ్లీగా మారింది.. కళ్లు తిప్పుకోలేరు..!
Mahanati Child Artist : కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన మహానటి అనే సినిమాతో ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మహానటి సినిమాతో ఈ తరం వారికి కూడా సావిత్రిని గుర్తు చేశారు నాగి అయితే మహానటి చిత్రంలో సావిత్రి పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది కీర్తి సురేష్. ఈ సినిమాతో ఆమెకి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది.అయితే చిత్రంలో ‘బుల్లి’ సావిత్రిగా ఎంతో చెలాకీగా నటిస్తూ.. ఎవరీ పిల్లా అనిపించుకున్న చిన్నారి నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌కు సొంత మనవరాలు. అయితే, ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సినిమా ఆడియో ఫంక్షన్లోనే ఈమెను పరిచయం చేశారు.
Mahanati Child Artist అదే అందంతో..
చిన్నారి సావిత్రి పాత్రలో ఆమె భలే ఒదిగిపోయిందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. పెద్ద సావిత్రిగా కీర్తి సురేష్‌కు ఎంత పేరు వస్తుందో.. బుల్లి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ మనవరాలు తేజస్వినికి మంచి పేరు వచ్చింది. ‘ఆగిపో బాల్యమా.. నవ్వులో నాట్యమా సరదా సిరిమువ్వలవుదాం’సాంగ్‌తో పాటు పలు సన్నివేశాల్లో ఆకట్టుకుంది చిన్నారి. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజశ్విని ఇందులో చాలా చక్కగా నటించింది. సావిత్రి చిన్నప్పుడు ఇలానే ఉండేదా అనిపించేలా యాక్ట్ చేసింది ఈ అమ్మాయి. కీర్తి సురేష్‌తో పాటు ఈ పాపకు కూడా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్లు నిండిపోయాయి.
మరీ ఈ చిట్టి చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాలని అందరు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఆమె కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఇప్పటికీ అదే బబ్లీనెస్‌తో అలరిస్తుంది. ఇంత ఎదిగిందా అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహానటి తర్వాత బేబీ, సిరివెన్నెల, సరిలేకు నీకెవ్వరు, ఎర్ర చీర వంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ అమ్మాయి.. ప్రస్తుతం దూరంగా ఉంటుంది.