Indiramma Sarees : ఇందిరమ్మ చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక.. రజిత పరమేశ్వర్ రెడ్డి..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 24 June 2026, 4:00 pm
  •  Indiramma Sarees : ఇందిరమ్మ చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక.. రజిత పరమేశ్వర్ రెడ్డి..!

Indiramma Sarees : తెలంగాణలో మహిళల సంక్షేమం, సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉప్పల్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ చీరల’ పథకం మహిళలకు ఒక వరంలా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు.ఉప్పల్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ ప్రాంతంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేసిన ఆమె, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

Indiramma Sarees : ఇందిరమ్మ చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక.. రజిత పరమేశ్వర్ రెడ్డి..!

Indiramma Sarees : ఇందిరమ్మ చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక.. రజిత పరమేశ్వర్ రెడ్డి..!

Indiramma Sarees మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతున్న ఇందిరమ్మ చీరలు

ఈ సందర్భంగా రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు పంపిణీ చేసిన చీరలు నాణ్యత లేకపోవడంతో మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత నాణ్యమైన చేనేత వస్త్రాలను ‘ఇందిరమ్మ సారె’ పేరుతో అందిస్తోందని తెలిపారు.చేనేత కార్మికులు రూపొందించిన ఈ చీరలు మహిళలకు అందించడం ద్వారా ఒకవైపు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా, మరోవైపు చేనేత రంగానికి కూడా ప్రభుత్వం చేయూతనిస్తోందని ఆమె పేర్కొన్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలను అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత అని ఆమె కొనియాడారు.

Indiramma Sarees మహిళల సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

సోనియా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పలు విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోందని రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం, రూ.500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా మహిళల కుటుంబ భారం తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఈ పథకాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు.ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా తాము నిరంతరం కృషి చేస్తామని రజిత పరమేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మహిళలు ఆర్థికంగా బలపడాలని, భవిష్యత్తులో కోటీశ్వరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని మహిళలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బాకారం లక్ష్మణ్, లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవిరెడ్డి, అలుగుల అనీల్ కుమార్, కాటేపల్లి విజయ్ కుమార్, కుశంగళ సతీష్, సత్యనారాయణ చారి, తైసీన్, బచ్చ రాము, బొడగే మల్లేష్, నామోజు నరేష్, వెంకటేష్ సేటు, గట్టు ఇందిర, తుప్రాన్ అనిత, జనగామ విజయ, జి.రేణుక తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp