Home » Entertainment » Naga Babu Comments On Mega Heroes
Entertainment

Naga Babu : పిలిచి నాకు ఒక్కరు వేషం ఇవ్వలేదు మెగా హీరోలపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: February 16, 2023 12:47 pm
Advertisement

Naga Babu ; మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదల నిర్మాతగా “శ్రీదేవి శోభన్ బాబు” అనే సినిమా చేయడం జరిగింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంతోష్ శోభన్… గౌరీ కిషన్ ప్రధాన పాత్రలు గా నటించడం జరిగింది. ఈనెల 18వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ వేడుకకు మెగా బ్రదర్ నాగబాబు కూడా రావటం జరిగింది. ఈ సినిమాలో నాగబాబు ఓ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… మా ఇంట్లో చాలామంది హీరోలు ఉన్నారు. కానీ ఎవరు కూడా నాకు పాత్రలు ఇవ్వలేదు.

Advertisement

Naga Babu comments on mega heroes

కానీ సుస్మిత నాకు ఈ సినిమాలో… నెక్స్ట్ ఓ వెబ్ సిరీస్ లో పాత్ర ఇవ్వడం జరిగింది థాంక్యూ అమ్మ.”సుస్మిత తలుచుకుంటే స్టార్ హీరోలతో సినిమాలు చేయగల సత్తా ఉంది. కానీ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణంగా తానే సొంతంగా నిర్మాణ రంగంలో లోటుపాట్లు తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఈ రకంగా వెబ్ సిరీస్ నిర్మాణం నుండి సినిమాల నిర్మాణం దాకా రావటం జరిగింది. కచ్చితంగా చెబుతాను సుస్మిత త్వరలోనే ఓ మెగా ప్రొడ్యూసర్ కానుంది. ఆ రీతిగా “శ్రీదేవి శోభన్ బాబు” సినిమా మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

Advertisement

Naga Babu comments on mega heroes

ఇంకా సుస్మిత భర్త విష్ణు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఇద్దరికీ కూడా ఆల్ ది బెస్ట్ అని నాగబాబు స్పీచ్ ఇచ్చారు. ఇంకా సినిమాలో నటించిన నటీనటులపై తనదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపించారు. ఈ స్టోరీ విన్నప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. దర్శకుడు ప్రశాంత్ కుమార్ కి మంచి భవిష్యత్తు ఉంది అని పొగిడారు. కామెడీ సెంటిమెంటును పట్టుకుని ముందుకెళ్తే కచ్చితంగా పెద్ద దర్శకుడు అవుతావు. సంతోష్ శోభన్… గౌరీ ఇద్దరు చాలా బాగా చేశారు. అవకాశం వస్తే ఆడపిల్లలు అద్భుతాలు చేయగలరని విషయాన్ని నిరూపించే సినిమా “శ్రీదేవి శోభన్ బాబు” అంటూ నాగబాబు తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి