Naga Babu : అందుకే అడవికి రాజు సింహం .. మెగా బ్రదర్ కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 22 February 2021, 10:30 am

Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అయ్యాడో అందరికీ తెలిసిందే. పంచ్‌లు, సెటైర్లు, పరోక్షంగా కౌంటర్లు వేయడంలో రాటుదేలిపోయాడు. సూక్తులు చెప్పినట్టే చెప్పి ఎదురుదాడికి దిగుతుంటాడు. ఆ మధ్య నాగబాబు రేకెత్తిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. గాడ్సే, గాంధీ, కరెన్సీ నోటు, హిందూధర్మం, దేవుళ్లు, బాలయ్య బాబు మీద నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే.

Naga Babu quotation about attitude

Naga Babu quotation about attitude

నాగబాబు అలా నిత్యం ఏదో ఒకటి వైరల్ అయ్యేలా చేస్తుంటాడు. మామూలుగా ఆయన ఏం మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుంటుంది. ఆ మధ్య బొమ్మ అదిరింది వివాదం, ఏపీ సీఎం, జగన్ అభిమానుల మధ్య ఎంతటి వివాదం రేగిందో తెలిసిందే. ఆ దెబ్బతో ఆ షో కూడా పత్తా లేకుండాపోయింది. అలా నాగబాబు ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తిన వేసుకుంటాడు. అయితే అప్పుడప్పుడు నాగబాబు కొన్ని అదిరిపోయే కొటేషన్స్ చెబుతుంటాడు.

Naga Babu : మెగా బ్రదర్ కామెంట్స్ వైరల్

తాజాగా ఓ మోడ్రన్ లుక్‌లో దిగిన స్టిల్‌ను నాగబాబు షేర్ చేశాడు. అందులో మీసాన్ని తిప్పుతూ రాజసం ఉట్టిపడేలా ఉన్నాడు. బలం, ఆకారం, ఆకృతి, తెలివి ఇవన్నీ ఒకడ్ని రాజును చేయలేవు.. సింహానికి ఉండే ఆ యాటిట్యూడే దాన్ని అడివికి రాజుని చేసిందంటూ చెప్పుకొచ్చాడు. అంటే మనిషికి తనకంటూ ఓ ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉండాలని నాగబాబు చెబుతోన్నట్టుంది. అంతే కాకుండా తన భుజంపైనా సింహం బొమ్మే వేసుకున్నాడు. ఇదేదో కొత్త సినిమాలోని తన పాత్ర కోసం రెడీ అవుతున్నట్టుంది.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి