Naga Babu : పవన్, మహేష్, ప్రభాస్‌లతో మల్టీస్టారర్.. నాగబాబే షాకయ్యాడుగా..!
Naga Babu : ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ హంగామా నడుస్తుంది. పలువురు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తే ఫ్యాన్స్‌కి ఆ కిక్కే వేరు. రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇక ఇప్పుడు ఓ నెటిజన్ తన టాలెంట్‌ని ఉపయోగించి పవన్ కళ్యాణ్ పంజా సినిమా, ప్రభాస్ సాహో, మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలను కలిపి అద్భుతంగా ఎడిట్ చేసి చూపించాడు. దీంతో ఇదేదో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్‌ల మల్టీస్టారర్ సినిమాల అనిపించింది. కొందరైతే ఈ పోస్టర్ చూసి నిజంగానే మల్టీ స్టారర్ రూపొందనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.
ఈ పోస్టర్ చూసి మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. స్వరూప్అనే వ్యక్తి ఈ ఎడిటింగ్ చేయగా, అతడి స్కిల్స్ చూసి నాగబాబు ఫిదా అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఇదే మైండ్ బ్లోయింగ్ ఎడిట్. అద్భుతమైన పరిశీలను, క్షుణ్నంగా, పద్దతిగా కట్ చేసిన విధానానికి కుదోస్.. నా టీంలో ఉండాల్సింది నీలాంటి వాళ్లే. నాకు డైరెక్ట్ మెసెజ్ చేయ్ అని నాగబాబు పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఎడిటెడ్ వర్షన్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా అతడి సత్తా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Naga Babu : మల్టీ స్టారర్ పోస్టర్‌కి నాగబాబు ఫిదా..!
ఇక నాగబాబు విషయానికి వస్తే ఆయన జబర్ధస్త్ షోతో అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆయన అప్పుడప్పుడు పలు షోలతో రచ్చ చేస్తూ ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్నారు. కొంత గ్యాప్ తీసుకున్న ఆయన కామెడీ స్టార్స్ షోను కామెడీ స్టార్స్ ధమాకాగా మార్చేశాడు. జడ్జ్‌గా ఉన్న శ్రీదేవీని తీసేశారు. నాగబాబును మళ్లీ పట్టుకొచ్చారు. యాంకర్‌గా శ్రీముఖి పక్కకి తప్పకుంది. ఆమె స్థానంలో దీపిక పిల్లి వచ్చింది. మొత్తానికి నాగబాబు నవ్వులు మళ్లీ స్మాల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి.