Pushpa 2 The Rule : పుష్ప2 రిలీజ్‌కి ముందు నాగబాబు మళ్లీ బన్నీని కెలికాడా..!
ప్రధానాంశాలు:
Pushpa 2 The Rule : పుష్ప2 రిలీజ్‌కి ముందు నాగబాబు మళ్లీ బన్నీని కెలికాడా..!
Pushpa 2 The Rule : మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి అనే ప్రచారం జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లకుండా.. అతని ప్రత్యర్థి పార్టీ నాయకుడు, తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో మెగా ఫ్యామిలీలో చిచ్చు రేగింది. అప్పటి నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు టాక్ నడుస్తుంది.. బయటకు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేనట్లుగానే కనిపిస్తున్నా.. పలు ఈవెంట్లలో మెగా హీరోలు చేసే కామెంట్స్ అల్లు అర్జున్ Allu Arjun ని ఉద్దేశించినట్లుగా ఉండడం, మరోవైపు అల్లు అర్జున్ కామెంట్స్ మెగా ఫ్యామిలీకి ఇండైరెక్ట్ గా కౌంటర్ అన్నట్లుగా ఉంటున్నాయి.
Pushpa 2 The Rule నాగబాబు ట్వీట్ రచ్చ..
నాగబాబు తాజాగా వేసిన ట్వీట్‌తో మళ్లీ ఫ్యాన్ వార్ మొదలైంది. నాగబాబు వేసిన ఆ ట్వీట్ ఉద్దేశం, ఎవరి గురించి వేశాడు అన్నది తెలియక పోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం చర్చలు మొదలయ్యాయి. నాగబాబు ట్వీట్‌తో మళ్లీ మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా ఫ్యాన్ వార్ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ బన్నీ మీద ట్రోలింగ్ చేస్తుంటే.. బన్నీ ఫ్యాన్స్ నాగబాబుని ట్రోలింగ్ చేస్తున్నారు. మధ్యలో వరుణ్ తేజ్ మట్కాని లాగి దారుణంగా పరువు తీస్తున్నారు. స్వామి వివేకానంద చెప్పాడంటూ ఓ కొటేషన్‌ను నాగబాబు షేర్ చేశాడు. నువ్వు వెళ్లే దారి, పద్దతి సరైనది కాదని అనుకో.. ఆ విషయాన్ని త్వరగా తెలుసుకుని, రియలైజ్ అవ్వాలి.. లేదని అలానే చాలా దూరం వెళ్లావ్ అనుకో.. మళ్లీ తిరిగి వెనక్కి రాలేవు అనేది దాని అర్థం. ఇప్పుడు నాగబాబు ఈ కొటేషన్‌ను ఎందుకు షేర్ చేశాడు అంటూ చర్చలు స్టార్ట్ అయ్యాయి.
చూస్తుంటే ఈ కొటేషన్, ట్వీట్ బన్నీకి కౌంటర్‌గా ఉన్నట్టుందే అని మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేయసాగారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా తిరిగి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి మీ మట్కాని ఇండస్ట్రీ హిట్ చేశారు కదా.. అని కౌంటర్లు వేస్తున్నారు. ముందు మీ మట్కాని చూసుకోండంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఆ తప్పు దారిలో వెళ్లినందుకు ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటూ బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు సద్ధుమణుగుతుందో చూడాల్సి ఉంది.