Pushpa 2 Ticket Price : పుష్ప 2 రేట్లు సరే.. టికెట్లు తెగుతాయా లేదా..?
ప్రధానాంశాలు:
Pushpa 2 Ticket Price : పుష్ప 2 రేట్లు సరే.. టికెట్లు తెగుతాయా లేదా..?
Pushpa 2 Ticket Price : డిసెంబర్ 5 గురువారం పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే నేషనల్ వైడ్ గా ఈ సినిమా సూపర్ బజ్ ఏర్పరచుకుంది. ఐతే ఈ సినిమా టికెట్ రేట్ల ఇష్యూ పెద్దది అవుతుంది. తెలంగాణా ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 రేట్లను భారీగా పెంచేశారు. సింగిల్ స్క్రీన్ లో దాదాపు డబుల్ ప్రైజ్ ఉంది. మల్టీప్లెక్స్ లో కూడా అంతే. బెనిఫిట్ షోస్ కు కూడా 1000 రూపాయల దాకా టికెట్ ప్రైజ్ ఉంది.
ఐతే రేట్లు కామన్ ఆడియన్స్ కి అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ కోసం మాత్రమే ఇలా టికెట్ రేట్లను పెంచారని తెలుస్తున్నా.. కామన్ ఆడియన్స్ సినిమా చూడాలంటే వాళ్లకు ఈ టికెట్ రేట్లు అధిక భారం అయ్యేలా ఉన్నాయి. 800 రూపాయల్ టికెట్ తో పుష్ప 2 ని ఒక నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ చూడాలంటే 3200 ప్లస్ అక్కడ ఖర్చులు కలుపుకుని దాదాపు 5000 దాకా జేబులు ఖాళీ చేయాల్సి ఉంటుంది.
Pushpa 2 Ticket Price టికెట్ రేట్ల మీద విమర్శలు..
అందుకే సోషల్ మీడియాలో పుష్ప 2 టికెట్ రేట్ల మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ట్విట్టర్ లో బోయ్ కాట్ పుష్ప 2 ట్రెండింగ్ కూడా నడుస్తుంది. ఈ రేట్లు పుష్ప 2 టికెట్లు తెగేలా చేస్తాయా లేదా అన్నది చూడాలి. ఐతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం టికెట్ రేటు ఎంత ఉన్నా సరే సినిమా చూసి తీరాల్సిందే అనేలా ఉత్సాహం చూపిస్తున్నారు.
ఏది ఏమైనా టికెట్ రేట్లు పెంచడం పుష్ప 3 మీద ఎఫెక్ట్ పడేలా ఉంది. మరి నిర్మాతలు ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చూడాలి. సినిమా రిలీజ్ ముందు ఈ టికెట్ రేట్ల ఇష్యూ పెద్దదైతే మాత్రం ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది. కేవలం కలెక్షన్స్ కోసమే ఇలా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచారని తెలుస్తుంది. Pushpa 2 Ticket Price Hike Social Media Target , Allu Arjun, Pushpa 2, Pushpa 2 Ticket Price Hike, Mytri Movie Makers,