Naga Chaitanya : ఫ్యామిలీ గౌరవం, ప్రతిష్టే ముఖ్యం.. సమంతపై నాగ చైతన్య సెటైర్స్
Naga Chaitanya : నాగ చైతన్య, సమంతల విషయానికి సంబంధించిన ఏ టాపిక్ అయినా కూడా నెట్టింట్లో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఇద్దరి విడాకుల అంశం ఎప్పుడూ ఏదో ఒక రకంగా చర్చల్లోకి వస్తూనే ఉంది. అయితే సమంతకు సంబంధించిన వార్తలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో రాజ్యమేలుతున్నాయి. ఆమె చేస్తోన్న స్పెషల్ సాంగ్, బాలీవుడ్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
సమంత అలా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తూ.. ఓ హద్దులనేవి పెట్టుకోకుండా ప్రాజెక్ట్‌లను అంగీకరిస్తోంది. తనకు నచ్చినట్టుగా బతికేస్తోంది. ఇప్పుడు మొత్తానికి ఆమెకు ఎలాంటి బంధనాలు కూడా లేవు. దీంతో సమంత మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలో నాగ చైతన్య చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎలాంటి పాత్రలు చేయాలని ఉందంటూ ఇటీవల నాగ చైతన్యకు ఓ ప్రశ్న ఎదురైంది.

Naga Chaitanya About Future Role In Movies Indurect Satires On Samantha
Naga Chaitanya : అలాంటి పాత్రలు చేస్తానన్న చైతూ..
దానికి నాగ చైతన్య ఇలా బదులిచ్చాడట. ఏ పాత్రనైనా చేసేందుకు తాను సిద్దమేనని, కానీ దాని వల్ల కుటుంబ ప్రతిష్టకు, గౌరవానికి ఎలాంటి భంగం కలగకూడదు. అలాంటి ఏ పాత్రకైనా తాను వెంటనే ఓకే చెబుతాను అని నాగ చైతన్య చెప్పేశాడు. అంటే సమంత మాత్రం ఇలాంటి వాటిని పట్టించుకోదని పరోక్షంగా నాగ చైతన్య కామెంట్ చేశాడా? అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.