Naga Chaitanya : నాకు ఆ డైరెక్టర్ కావాలంటే నాన్న సెట్ చేస్తారు.. కానీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Chaitanya : నాకు ఆ డైరెక్టర్ కావాలంటే నాన్న సెట్ చేస్తారు.. కానీ..!

 Authored By ramesh | The Telugu News | Updated on :28 January 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Naga Chaitanya : నాకు ఆ డైరెక్టర్ కావాలంటే నాన్న సెట్ చేస్తారు.. కానీ..!

Naga Chaitanya : అక్కినేని ఫ్యామిలీ నాగ చైతన్య, అఖిల్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఐతే నాగ చైతన్య లవ్ స్టోరీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. మరోపక్క అఖిల్ రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ వస్తున్నాడు. ఐతే నాగ చైతన్య ఈమధ్య కాస్త దూకుడు పెంచాడు. ముఖ్యంగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. నాగార్జున లేటెస్ట్ మూవీ తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది.ఐతే తమ కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నానని చెబుతున్న చైతన్య నాన్నకు ఫోన్ చేసి నాకు ఆ డైరెక్టర్ తో సినిమా కావాలని అడిగితే నైట్ కి నైటే కాంబినేషన్ సెట్ చేస్తారని కాకపోతే అలా చేయడం తనకు ఇష్టం లేదని చైతన్య అన్నారు. తనకు వచ్చిన సినిమాలను తాను చేసుకుంటూ వెళ్తున్నానని. అవి ఫ్యాన్స్ కి నచ్చుతున్నాయని అన్నారు.

Naga Chaitanya నాకు ఆ డైరెక్టర్ కావాలంటే నాన్న సెట్ చేస్తారు కానీ

Naga Chaitanya : నాకు ఆ డైరెక్టర్ కావాలంటే నాన్న సెట్ చేస్తారు.. కానీ..!

Naga Chaitanya : మేము కూడా అలాంటివి ఆలోచించలేదని

క్రేజీ కాంబినేషన్స్, స్టార్ డైరెక్టర్స్ సెట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు కానీ నాన్న ఎప్పుడు తమని అలా అడగలేదు. మేము కూడా అలాంటివి ఆలోచించలేదని అన్నాడు నాగ చైతన్య. తండేల్ సినిమాతో నాగ చైతన్య గురి భారీగానే ఉంది. సినిమాలో సాయి పల్లవి నటించడం తో ఆమె క్రేజ్ ఒక అసెట్ అయ్యేలా ఉంది.

ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన 3 సాంగ్స్ కూడా సూపర్ హిట్ కాగా సినిమాపై విపరీతమైన బజ్ పెంచాయి. తప్పకుండా నాగ చైతన్య తండేల్ కెరీర్ బెస్ట్ సినిమా అవుతుందని అనిపిస్తుంది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు. చైతన్య ఇలా సినిమాలతో దూసుకెళ్తుంటే నాగార్జున సోలో సినిమా కథల వేటలో ఉన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు మన కింగ్. అఖిల్ ఏజెంట్ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. Naga Chaitanya, Nagarjuna, Akkineni Family, Akhil, Tollywood, Thandel, Sai Pallavi

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది