Naga Chaitanya : శోభిత గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇది అసలు ఊహించలేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Chaitanya : శోభిత గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇది అసలు ఊహించలేదుగా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :2 February 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Naga Chaitanya : శోభిత గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇది అసలు ఊహించలేదుగా..!

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య సమంతతో డైవర్స్ తీసుకున్న తర్వాత ఒక 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మరో హీరోయిన్ శోభితను పెళ్లాడాడు. శోభిత పెళ్లాడిన తర్వాత మొదటిసారి తన భార్య గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. శోభితతో పెళ్లి జరిగి రెండు నెలలే అయ్యింది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ జీవితం చాలా హ్యాపీగా ఉందని అన్నారు నాగ చైతన్య. అంతేకాదు తానైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా అని.. ఇద్దరం ఒకరికొకరం మంచి టైం ఇచ్చుకుంటున్నాం.. షూటిగులు ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ కి ఈక్వల్ టైం కేటాయిస్తున్నాం అని అన్నారు. వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నామని నాగ చైతన్య అన్నారు. అంతేకాదు శోభిత్కు నాకు సినిమాలంటే ఇష్టం. ఇద్దరం వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతామని అన్నారు.

Naga Chaitanya శోభిత గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్ ఇది అసలు ఊహించలేదుగా

Naga Chaitanya : శోభిత గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇది అసలు ఊహించలేదుగా..!

Naga Chaitanya : శోభితతో కలిసి చేసే రోజు..

ఇక తనకు నాకు ట్రావెలింగ్ కూడా ఇష్టమని.. అందుకే ట్రావెల్ కూడా చేస్తామని అన్నారు. భార్య శోభితతో కలిసి చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నా అని మంచి స్క్రిప్ట్ వస్తే కలిసి చేసేందుకు రెడీ అంటున్నారు నాగ చైతన్య. ఏది ఏమైనా ఈ కొత్త జంట బయట ఎక్కువగా కనిపించట్లేదు కానీ పెళ్లి తర్వాత నాగ చైతన్య చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు అన్నది మాత్రం నిజం.

నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ నెల 7న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. కెరీర్ లో ఫస్ట్ టైం నాగ చైతన్య సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా సినిమాతో అక్కినేని హీరో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు. నాగ చైతన్య సాయి పల్లవి జంట ఇప్పటికే లవ్ స్టోరీతో ఒక సూపర్ హిట్ కొట్టగా ఈ కాంబోలో వస్తున్న తండేల్ మరో సంచలన విజయం అందుకునేలా ఉంది. Naga Chaitanya, Shobhitha, Akkineni Family, Thandel, Sai Pallavi, Tollywood

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది