Home » Entertainment » Naga Chaitanya Frustration On Samantha Related Questions
Entertainment

Naga Chaitanya : వినీ వినీ విసిగి వేసారిపోయాను.. ఆ ప్రశ్నలపై నాగ చైతన్య అసహనం

Authored By
aruna
The Telugu News | Published on: August 1, 2022, 10:20 pm
Advertisement

Naga Chaitanya : నాగ చైతన్య, సమంత విడిపోయిన క్షణం నుంచి నెట్టింట్లో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే వస్తోంది. ఈ ఇద్దరి విడాకుల వ్యవహారం, అంతకు ముందు నుంచే వచ్చిన రూమర్లు, ఇన్ స్టాలో సమంత తనే పేరు మార్చుకోవడం, అక్కినేని ట్యాగ్ వదిలేసుకోవడం, ఇలా ఎన్నెన్నో జరిగిపోయాయి. ఇక సమంత నాగ చైతన్య విడిపోయారని, దానికి ఇవే కారణాలు లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. అయితే వాటిలో ఏది నిజం ఏది అబద్దం అన్నది ఆ ఇద్దరికే తెలియాలి. మొత్తానికి విడిపోయారు. వేర్వేరుగా ఉంటున్నారు. ఇక సమంత మీద వచ్చినంత నెగెటివ్ ఇమేజ్, వచ్చినన్ని రూమర్లు, అంటగట్టిన అక్రమ సంబంధాలు, అబండాలు అన్నీ ఇన్నీ కావు.

Advertisement

సమంత తన చుట్టూ ఉన్న గ్యాంగ్ వల్లే ఇలా చేసిందని, ప్రీతమ్ జుకాల్కర్ మీద కూడా అనుమానించారు. అలా సమంత మీద లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. వాటన్నంటిని సమంత కొట్టి పారేసింది. మగాడు చేస్తే ఇలా.. ఆడది చేస్తే అలానా? అంటూ నాగ చైతన్య మీద పరోక్షంగా ఎన్నో సార్లు స్పందించింది. నేరుగానో, పరోక్షంగానో గానీ సమంత మాత్రం ఈ విడాకుల అంశంలో తన తప్పు లేదంటూ స్పందిస్తూనే వస్తోంది. మరో వైపు నాగ చైతన్య వేరే హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండటం మూలానే సమంత దూరంగా వెళ్లిపోయిందనే టాక్ కూడా ఉంది. ఆ మధ్య శోభితా దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడనే రూమర్లు వచ్చాయి.. దీనిపై సమంత కూడా పరోక్షంగా స్పందించడంతో నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు నాగ చైతన్య రియాక్షన్లు కూడా వైరల్ అవుతున్నాయి.

Naga Chaitanya Frustration On Samantha Related Questions

Advertisement

ఎప్పుడూ అవే ప్రశ్నలా? ఎప్పుడూ మా ఇద్దరి పర్సనల్ విషయాలకు సంబంధించిన ప్రశ్నలేనా? అని నాగ చైతన్య కాస్త ఫ్రస్టేట్ అవుతున్నాడట. నేను నా ప్రొఫెషనల్ కెరీర్‌లో ఎంత సంపాదిస్తున్నా.. ఏం సాధిస్తున్నా కూడా అవేవీ కూడా హెడ్ లైన్ అవ్వడం లేదు.. కానీ నా పర్సనల్ లైఫ్‌ను మాత్రం టార్గెట్ చేస్తున్నారు.. మేం సెలెబ్రిటీలమైనా కూడా మాకంటూ పర్సనల్ ఉంటుంది.. అందుకే దాన్ని పర్సనల్ అంటారు.. పర్సనల్ లైఫ్‌ను పర్సనల్ లైఫ్‌గానే చూడాలి.. నేను దాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాను.. నా కెరీర్‌లో నేను ఇంకా ఎక్కువగా సాధించాల్సి ఉంది.. అప్పుడైనా పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోవడం మానేస్తారేమో అన్నట్టుగా నాగ చైతన్య జాతీయ మీడియాతో చెప్పుకొచ్చాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి