Home » Entertainment » Naga Chaitanya Indirect Comments On Samantha Going Viral
Entertainment

Naga chaitanya : నాగ చైతన్య మాటల్లో అంతరార్ధమేంటి.. ఆ మాట ఇన్ డైరెక్ట్ గా సమంతానే అన్నాడా.. వైరల్ న్యూస్!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 20, 2021, 10:20 am
Advertisement

Naga chaitanya : టాలీవుడ్ క్యూట్ పెయిర్  నాగ చైతన్య, స‌మంత‌ విడాకుల వార్త విని వారి అభిమానులు ఇంకా కోలుకోవడం లేదు. అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన సమంత నాలుగేళ్లు తిరగకముందే ఊహించని విధంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. విడాకుల అనంతరం… వీరిద్దరికీ సంబంధించిన ప్రతీ అంశం వైరల్ అవుతూ రాగా.. ఈ అంశంపై వీరిద్దరూ ఇప్పటివరకు అఫిషియల్ గా స్పందించక పోవడం గమనార్హం. సమంత మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ ఇన్ డైరెక్ట్ గా ఎవరిపైనో విమర్శలు చేస్తూ వచ్చింది. సామ్ పెట్టిన ప్రతీ పోస్టు వైరల్ అవుతూ ఉండగా..

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.మాజీ భార్య సమంతతో విడాకుల తరువాత అంతగా స్పందించని నాగ చైతన్య.. తాజాగా ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఎలాంటి పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తి చూప‌రు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ రిప్లై ఇచ్చాడు. తాను అన్నీ త‌ర‌హా పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఎప్పుడూ సిద్ధ‌మేనని స్పష్టం చేసిన నాగ చైతన్య.. తాను చేసే సినిమా కానీ, పాత్ర కానీ తన కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదని తేల్చి చెప్పారు. అయితే నాగ చైతన్య ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తన మాజీ భార్య సమంతను ఉద్దేశించి అన్నవే అని నెటిజన్లు అంటున్నారు.

Naga chaitanya indirect comments on samantha going viral

Advertisement

Naga chaitanya : సమంతాపై నాగ చైతన్య ఇన్ డైరెక్ట్ వ్యాఖ్యలు..?

స‌మంత‌ కు నచ్చిన పాత్రలు పోషిస్తున్నందునే ఆమెకు విడాకులు ఇచ్చారా అంటూ సోషల్ మీడియాలో నాగ చైతన్య ని ప్రశ్నిస్తున్నారు.స‌మంత‌ గతేడాది నటించిన ఫ్యామిలీ మెన్ సిరీస్ , సూపర్ డీలక్స్ చిత్రాలు సూపర్ హిట్ లుగా నిలిచి ఆమెకు పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె పోషించిన పాత్రలు వివాదాస్పదంగా ఉన్నాయి. అక్కినేని కుటుంబం లోని ఓ మహిళ అలాంటి పాత్రలు చేయకూడదని సమంతపై ఒత్తిడి పెంచారని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. వివాదాల కారణంగానే ఆమె ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చేసిందని టాక్ వినిపించింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి