Naga Chaitanya : నా జీవితంలో మరో ప్రేమలేఖ.. నాగచైతన్య ఆసక్తికర పోస్టు..!
Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా నాగచైతన్య ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టాడు. తన జీవితంలోకి మరో ప్రేమ లేఖ వచ్చేసిందంటూ చేసిన ఆ పోస్టు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత సమంత సోషల్ మీడియాలో ఇంతకు ముందులాగానే చాలా యాక్టివ్‌గా ఉంది.
తనకు సంబంధించిన విషయాలపై రకరకాల పోస్టులు చేస్తోంది.తాజా నాగచైతన్య కూడా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టాడు. ఇంతకీ నాగచైతన్య ఏ విషయానికి సంబంధించిన పోస్టు పెట్టాడంటే..మాథ్యూ మాక్కోనాగై అనే రైటర్ రాసిన బుక్ ఫొటో పోస్ట్ చేసిన నాగచైతన్య..అది తన జీవితానికి ఒక ప్రేమ లేఖని, తన లైఫ్ హిస్టరీని పంచుకున్నందుకుగాను రైటర్ మాథ్యూకు థాంక్స్ చెప్పాడు నాగచైతన్య.
Naga Chaitanya : తన జీవితంలో ఇక గ్రీన్ సిగ్నిల్ వచ్చేసిందన్న నాగచైతన్య..

naga chaitanya interesting post in instagram
ఈ క్రమంలోనే ఆ బుక్ తన లైఫ్‌కు గ్రీన్ సిగ్నల్ లాంటిదని పేర్కొన్నాడు. ఇక ఈ పోస్టు పెట్టిన తర్వాత నాగచైతన్య ఏ ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టాడోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ పోస్టుకు అర్థం ఎలా తెలుస్తుందని అనుకుంటున్నారు. సమంతతో డైవోర్స్ తర్వాత నాగచైతన్య కూడా పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయాడని చెప్పేందుకే ఈ పోస్టు పెట్టాడని నెటిజన్లు అనుకుంటున్నారు. మొత్తంగా నాగచైతన్య సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యాడు.
నాగచైతన్య ప్రస్తుతం తెలుగులో ‘థాంక్యూ, బంగార్రాజు’ చిత్రాల్లో నటిస్తున్నాడు. అమీర్ ఖాన్‌తో నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’ అనే ఫిల్మ్‌లో నటించాడు. ఈ సినిమాలో ‘బాలరాజు’ అనే కీలక పాత్రలో నాగచైతన్య కనిపించనున్నాడు. నాగచైతన్య తన తండ్రితో కలిసి ప్రజెంట్ ‘బంగార్రాజు’ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఇందులో నాగచైతన్యకు జోడీగా ‘ఉప్పెన’ బ్యూటి కృతిశెట్టి నటిస్తోంది.