Samantha | విడాకులు, వైద్య సమస్యలు రీ ఎంట్రీపై సమంత ఆసక్తికర కామెంట్స్
Samantha | సౌత్ బ్యూటీ సమంత తన వ్యక్తిగత జీవిత సమస్యలతో వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్యతో విడాకులు తర్వాత మాయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత, ఇటీవల కోలుకుని మళ్ళీ తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఓ ఇంటర్వ్యూలో సామ్ తన వ్యక్తిగత మరియు సినిమా జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
#image_title
కష్టాలతో..
“నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ప్రజల సమక్షంలోనే జరిగింది. విడాకుల సమయంలో, ఆరోగ్య సమస్యల సమయంలో ఎంత కష్టపడానో తెలుసు. ఆ సమయంలో నాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి, సోషల్ మీడియాలో జడ్జిమెంట్లు ఎదుర్కొన్నాను. నేనేమీ పర్ఫెక్ట్ కాదు, తప్పులు చేశాను, దెబ్బలు తిన్నాను, కానీ ఇప్పుడు బెటర్ అయ్యాను”..సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో “రక్త్ బ్రహ్మాండ్” సినిమాలో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ దర్శకులు రాజ్ & డీకే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకానుంది.తెలుగులో సమంత “మా ఇంటి బంగారం” సినిమాలో కనిపించనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత ఈ రెండు సినిమాలతో తన కెరీర్‌లో మరో మెట్టు అధిగమిస్తుందో లేదో చూడాల్సి ఉంది.