Naga Chaitanya | నాగ చైతన్య-శోభితా లవ్ స్టోరీ.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో రివీల్ చేసిన చైతూ
Naga Chaitanya | టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) జంటకి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత పబ్లిక్ అపియరెన్స్‌లు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్న చైతన్య, తాజాగా మొదటిసారిగా ఓ టీవీ టాక్ షోలో స్పందించాడు.
#image_title
క్యూట్ కామెంట్స్..
జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో కనిపించిన చైతన్య, తన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ ప్రయాణం గురించి ఎంతో ఓపికగా, నవ్వులు పూయించేలా మాట్లాడాడు. ముఖ్యంగా తన భార్య శోభితా గురించి చెబుతూ ..“నేను తనను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూశా. ఒకసారి నా క్లౌడ్ కిచన్ గురించి పోస్ట్ పెట్టినప్పుడు, తను ఒక ఎమోజీతో కామెంట్ చేసింది. అప్పుడే చాట్ మొదలై, కాస్త సమయంలో మేమిద్దరం కలిశాం” అంటూ చెప్పుకొచ్చాడు.
“ఎవరిని విడిచిపెట్టి ఉండలేవు?” అని అడగగా, చైతన్య “శోభితా, మై వైఫ్. తనే నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ సపోర్ట్” అని ఆన్సర్ ఇచ్చాడు. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.