Naga Chaitanya : మిస్ చేసుకున్నా.. ఆమెతో నా ప్ర‌యాణం చెరిగిపోదంటూ చైతూ కామెంట్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Naga Chaitanya : మిస్ చేసుకున్నా.. ఆమెతో నా ప్ర‌యాణం చెరిగిపోదంటూ చైతూ కామెంట్

Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైతన్య ప్ర‌స్తుతం తండేల్ అనే షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మరి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, తాజాగా నాగ చైత‌న్య‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన నాగ చైతన్య‌.. చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలు తనకు ఇష్టమైన ప్రదేశాలని ఎన్నోసార్లు చెప్పిన ఆయన.. రిటైర్ అయ్యాక మాత్రం గోవాలో సెటిలైపోతానని అంటున్నారు. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Naga Chaitanya : మిస్ చేసుకున్నా.. ఆమెతో నా ప్ర‌యాణం చెరిగిపోదంటూ చైతూ కామెంట్

Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైతన్య ప్ర‌స్తుతం తండేల్ అనే షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మరి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, తాజాగా నాగ చైత‌న్య‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన నాగ చైతన్య‌.. చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలు తనకు ఇష్టమైన ప్రదేశాలని ఎన్నోసార్లు చెప్పిన ఆయన.. రిటైర్ అయ్యాక మాత్రం గోవాలో సెటిలైపోతానని అంటున్నారు. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా గోవా తనకు చాలా స్పెషల్ అని ఆయన చెప్పారు. తనకు 45 ఏళ్లు వచ్చేసరికి గోవాకి షిప్ట్ అయి.. ఏడాదికి ఒక సినిమా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Naga Chaitanya 45 ఏళ్ల త‌ర్వాత అక్క‌డికే..

ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నానని నాగచైతన్య ఓ సందర్భంలో అన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉన్నప్పుడు మీరు గోవాకు ఎందుకు సార్ అని నెటిజన్లు చైతన్యను సరదాగా ప్రశ్నిస్తున్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన నాగ చైతన్య డిగ్రీ చదివే సమయానికి హైదరాబాద్‌కి వచ్చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో సమ్మర్ వెకేషన్‌కి ముంబై వెళ్లి ఎంజాయ్ చేసేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.. ఇక చిన్నప్పుడు తన తల్లితో ట్రైన్‌లో ముంబైకి వెళ్లి.. మరోసారి తల్లితో పాటు హైదరాబాద్‌కు ట్రైన్ జర్నీ చేశారట.

Naga Chaitanya మిస్ చేసుకున్నా ఆమెతో నా ప్ర‌యాణం చెరిగిపోదంటూ చైతూ కామెంట్

Naga Chaitanya : మిస్ చేసుకున్నా.. ఆమెతో నా ప్ర‌యాణం చెరిగిపోదంటూ చైతూ కామెంట్

ఈ రెండుసార్ల ప్రయాణం నాకు ఎప్పటికే స్పెషల్‌గానే ఉంటుందని, అది నా మది నుంచి ఎప్పటికి చెరిగిపోదని నాగ చైతన్య ఈ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.తండేల్ మూవీ తన కెరీర్‌లోనే సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని చైతూ సైతం ధీమాగా ఉన్నారు. మత్స్యకారుడి పాత్ర కోసం చైతూ పూర్తిగా మేకోవర్ అయ్యారు. వారి వేష బాషలు , బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడం కోసం శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో గడిపారు చైతన్య. కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న నాగ చైత‌న్య ఈ మూవీతో మాత్రం మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో అయితే ఉన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది