Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీర్ అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల లవ్‌స్టోరీ సినిమాలో తెలంగాణాలోని ఓ మధ్య తరగతి యువకుడిగా నటించి మెప్పించి మరిన్ని వర్గాలకు చేరువయ్యాడు. చైతుకు ఇలాగే మరో రెండు మూడు హిట్లు పడితే అతను పక్కా స్టార్ హీరోల రేంజ్ చేరుకుంటాడని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే చైతు గతంలో మిస్ చేసుకున్న కొన్ని సినిమాలే గనుక అతను చేసి ఉంటే… అతని కెరియర్ మరోలా ఉండేదంటున్నారు. వేరే సినిమాలతో బిజీగా ఉండడం కారణాంగానే.. లేక కథపై నమ్మకం లేకపోవడం వల్లనో కానీ చైతు ఎన్నో సినిమాలను మిస్ చేసుకున్నాడు. అందుల్లో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా ఉన్నాయి. ఆ 10 సినిమాలెంటో మనమూ ఓ లుక్కేద్దాం రండి.
1- ఢమరుకం : చైతు తండ్రి, ఎవర్ గ్రీన్ మన్మధుడు నాగార్జున నటించిన ఢమరుకం సినిమా కథ ముందుగా చైతు దగ్గరకే వెళ్లిందట. కానీ ఆ పాత్ర తనకంటే తన తండ్రికే బాగా సెట్ అవుతుందని చైతు ఆ సినిమాను కాదన్నట్లు సమాచారం. 2- కొత్తబంగారులోకం : కొత్తబంగారులోకంతో సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిల మనసులు దోచేశాడు వరుణ్ సందేశ్. పన్నేండేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. వాస్తవానికి చైతు ఈ సినిమాతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అనుకోకుండా వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో నటించాడు. ఇదే చిత్రాన్ని చైతు గనుక చేసి ఉంటే ఆయన కెరియర్ మరోలా ఉండేదని చెప్పవచ్చు.
3- అన్నీ మంచిశకునములే : టాలెంటెడ్ దర్శకురాలు నందినీరెడ్డి… అన్నీ మంచిశకునములే సినిమా కథను ముందుగా చైతన్యకే వినిపించినప్పటికీ ఆయన ఈ సినిమాకి సై అనలేదు.
4- రిపబ్లిక్ : ప్రముఖ దర్శకుడు దేవ కట్టా రిపబ్లిక్ సినిమా కథను ముందుగా చైతుతో చేయాలని అనుకున్నాడట. అయితే చైతు అందుకు నో చెప్పడంతో… అది కాస్త సాయి థరమ్ తేజ్‌కు వెళ్లి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
5 – గౌరవం: అల్లు శిరిష్ తెరగేంట్రం చేసిన గౌరవం సినిమా… వాస్తవానికి చైతు చేయాల్సింది. ఈ కథ ముందుగా చైతు దగ్గరకే వెళ్లింది. కానీ ఏవో కారణాల వల్ల చిత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత అల్లు శిరీష్ చేసిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. అయితే కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా… శిరిష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
6- భలే భలే మగాడివోయ్: నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచిన భలే భలే మగాడివోయ్ చిత్రం కథ ముందుగా చైతునే విన్నాడు.కానీ అప్పటి బిజీ షెడ్యూల్ కారణంగా ఆ చిత్రాన్ని కూడా అతను వదులుకున్నాడు. ఈ సినిమా గనుక చైతు చేసి ఉంటే నటనలో అతను మరింత మంచి పేరు సంపాదించి ఉండేవాడు.
7- అఆ : సమంతా, నితిన్ జంటగా వచ్చిన చిత్రం అఆ తెలుగు సినీ చరిత్రలో పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమా సమంతాకే కాకుండా నితిన్ కి కూడాఅతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే ఈ కథను త్రివిక్రమ్ ముందుగా చైతుకే వినిపించారు. కానీ పలు కారణాల వల్ల చైతు ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్నారు.
8-సమ్మోహనం : ప్రిన్స్ మహేశ్ బాబు బావ, టాలెంటెడ్ నటుడు సుధీర్‌బాబు నటించి, మెప్పించిన సమ్మోహనం సినిమా కూడా చైతు మిస్ చేసుకున్నాడు.
9- మహాసముద్రం : శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన మహాసముద్రం కథలో ఓ పాత్రకు అజయ్ భూపతి చైతును సంప్రదించినా… కథ నచ్చకపోవడంతో చైతు ఈ సినిమాకు నో చెప్పాడు.
10- వరుడు కావలెను : యంగ్ హీరో నాగశౌర్య నటించిన వరుడు కావలెను స్టోరీ లైన్ ముందు చైతు దగ్గరకే వెళ్లిందట. కానీ ఆయన పలు కారణాల వల్ల ఈ చిత్రం ఒప్పుకోలేదని సమాచారం.
సమంతాతో విడాకుల అనంతరం చైతు పూర్తిగా తన కెరీర్ మీదే ఫోకస్ చేస్తూ దూసుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం థ్యాంక్యు, బంగార్రాజు సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో తన తండ్రితో కలిసి నటిస్తోన్న బంగార్రాజుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.