
intinti gruhalakshmi 30 november 2021 full episode
Intinti Gruhalakshmi 30 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 490 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ సునీత రావడం కుదరదని చెప్పడంతో డాక్టర్ అద్వైత కృష్ణ వచ్చి తులసిని చెక్ చేస్తాడు. ఆమెను చెక్ చేశాక.. బయటికి వస్తాడు అద్వైత కృష్ణ. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్ అని అడుగుతాడు నందు. దీంతో కూల్ గా ఉండండి. ప్రమాదం ఏం లేదు అంటాడు డాక్టర్. వెళ్లి టేబుల్ మీద కూర్చొని మంచి నీళ్ల గ్లాస్ తీసుకొని.. నీళ్ల గాస్ నిండా నీళ్లు పోస్తుంటాడు. ఏంటి డాక్టర్.. మీరసలు డాక్టరేనా.. తులసికి ఏమైది అంటే చెప్పడం లేదు అని సీరియస్ అవుతాడు నందు.
ఇదే నా సమాధానం మిస్టర్ నందు అంటాడు. ఇదే తులసి ఆరోగ్య పరిస్థితి అంటాడు. ఏంటి అర్థం కాలేదా అంటాడు. తులసి బ్రెయిన్ ఈ గ్లాస్ అనుకుంటుంటే ఇందులో ఉన్న నీళ్లు నీ వల్ల కలుగుతున్న ప్రెజర్. టెన్షన్స్, బాధ్యతలు, గొడవలు, అవమానాలు, గాయాలు.. తన శక్తికి మించి భరిస్తూ ఉంది. తన గుండె తట్టుకోలేకపోకపోయినా కానీ.. అవన్నీ మౌనంగా భరిస్తోంది. మనం మగవాళ్లం. ప్రతి చిన్నవిషయానికి కొంపలు అంటుకుపోయినట్టు ఆడవాళ్ల మీద అరుస్తాం.
ప్రతి దానికి వాళ్ల మీద అరిచి మనం రిలాక్స్ అయిపోతాం. కానీ.. కిక్కురుమనకుండా మన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో భరిస్తారు. ఆ హద్దు దాటితే ఆ సహనం మోయలేనంత భారంగా మారుతుంది. ఎన్నో చినుకులు కలిసి నదిలా మారుతాయి. ఆ నదులన్నీ కలిసి సముద్రంలా మారుతుంది. మనం పట్టించుకోకపోతే ఏదో ఒక రోజు ఆ సముద్రం కూడా ఇంకిపోతుంది.
intinti gruhalakshmi 30 november 2021 full episode
ఎడారిలా మారిపోతున్నాయి. ఇప్పుడు తులసి విషయంలో జరిగిందీ అదే. గుండెలో ఇన్నాళ్లు గుట్టుగా దాచుకున్న బాధలు అన్నీ ఓవర్ ఫ్లో అయి తనను బాధపెడుతున్నాయి. తులసికి ఎలా ఉందని ఇప్పుడు మీరు పడుతున్న కంగారు.. కొన్నెళ్ల క్రితం మీరు పడి ఉంటే.. తులసికి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. అంటాడు అద్వైత కృష్ణ.
ఇది తులసి ప్రాబ్లమ్. ఇక నుంచి మీరంతా తనతో ఎలా ఉంటారో మీరే నిర్ణయించుకోవాలి అంటాడు డాక్టర్. నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నట్టు నాకు అనిపిస్తోంది అంటాడు డాక్టర్. కుదురుగా ఉండకుండా.. నాకు నేను సమస్యలు సృష్టించుకొని అందరికీ సమస్యగా మారాను అంటాడు.
గతంలో నేను ఒక తప్పు చేశాను. దాని వల్లే ఇన్ని సమస్యలు అంటాడు నందు. పశ్చాతాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. అది నేను ఒప్పుకోను. మీరు చేసిన తప్పు వల్ల తులసి ప్రాణానికి ముప్పుగా మారింది. మీకు ఆడవాళ్లు అంటే అంత చులకనా.. అని డాక్టర్ క్లాస్ పీకుతాడు.
ఇంతలో తులసికి స్పృహ వస్తుంది. నాకు ఏం కాలేదు అండి.. అంటుంది. నేను ఖాళీగా కూర్చుంటేనే నాకు ఏదో ఒకటి అవుతుంది.. అంటుంది. లాస్యకు ఫోన్ చేశారా అని అడుగుతుంది. ఇప్పుడు లాస్య గురించి ఎందుకు అంటాడు నందు. ఏం కాదు చేయండి.. లాస్యను కూడా ఇక్కడికి రమ్మనండి అంటుంది.లాస్య నాకు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు.. అంటాడు నందు. అదేంటి.. అందరం ఇక్కడుంటే తను అక్కడుండి ఏం చేస్తుంది. అసలే.. తను పెళ్లి గురించి టెన్షన్ పడుతోంది.. అని అంటే.. పెళ్లి కొన్నిరోజులు పోస్ట్ పోన్ చేసుకున్నాం అంటాడు నందు.
అంతా మీ ఇష్టమేనా.. లాస్యను అడగరా అంటుంది తులసి. నాకు బాగా లేదని మీ పెళ్లిని వాయిదా వేస్తున్నారా? దీనికి నేను అస్సలు ఒప్పుకోను. వెంటనే లాస్యకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను అంటుంది. కానీ.. తనకు చేతగాదు. ఇంతలోనే లాస్య అక్కడికి వస్తుంది. వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉండటం చూసి షాక్ అవుతుంది లాస్య.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.