Naga Chaitanya : సమంత తల్లి ముందు ఏడ్చేసి క్షమాపణ చెప్పిన నాగ చైతన్య..!
Naga Chaitanya : నాగ చైతన్య మరియు సమంతలు విడిపోతున్నట్లుగా ప్రకటించి నెలలు గడిచి పోయింది. ఇద్దరికి కోర్టు నుండి అధికారికంగా విడాకులు రాలేదు. కాని ఇద్దరు విడి పోయినట్లే. అయితే ఇప్పటికి కూడా అభిమానులు వీరిద్దరు కలిస్తే బాగుండు.. మళ్లీ ఏదో ఒక అద్బుతం జరిగి వీరు కలవాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఔను అనే సమాధానం కొందరు ఇస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.
అసలు ఏం జరిగింది అంటే.. నాగ చైతన్య ఎంత సున్నితపు మనస్కుడో అందరికి తెల్సిందే. సమంత నుండి బ్రేకప్ అయిన తర్వాత చైతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. రెండు మూడు నెలల వరకు ఆయన మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు కూడా ఆయన మీడియాతో ఇతర జనాలతో పూర్తి స్థాయిలో మాట్లాడలేక పోతున్నాడు. అలాంటి నాగ చైతన్య ఇటీవల సమంత తల్లి గారికి ఫోన్ చేసి విడాకులు తీసుకోబోతున్నందుకు గాను క్షమాపణలు చెప్పాడట. సమంత తల్లికి నాగ చైతన్య అంటే ప్రత్యేకమైన అభిమానం అంటూ చెబుతూ ఉంటారు.
Naga Chaitanya : నాగ చైతన్య, సమంతలు మళ్లీ కలిస్తే..
కొడుకు మాదిరిగా ఆమె చైతూ ను చూసుకునేదట. అందుకే అత్త కు ఫోన్ చేసి విడాకుల విషయమై తాము తీసుకున్న నిర్ణయానికి సారి చెప్పడంతో పాటు ఆ సమయంలో చైతూ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలు నిజం కాకపోవడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే నాగ చైతన్య ఖచ్చితంగా కాస్త ఎమోషనల్ ఎక్కువ ఉండే పర్సన్. కనుక విడాకుల విషయం ప్రస్తావనకు వచ్చిన సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఉంటాడు అనడంలో సందేహం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం నిజం ఎంత అనేది వారిద్దరిలో ఎవరో ఒకరు చెప్తే కాని తెలియదు. వారిద్దరు ఈ విషయాన్ని బయట పెట్టరు. కనుక అది ఒక పుకారుగానే ఎప్పటికి ఉండి పోవాల్సిందే. చైతూ కన్నీళ్లు పెట్టుకున్న నేపథ్యంలో సమంత మళ్లీ వస్తే కలిసేందుకు ఓకే అన్నట్లుగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని చైతూ కు సమంత అంటే పూర్తిగా ఇష్టం పోయిందని.. ఆమె పై ప్రేమ లేకుండా ఎలా ఆమెతో కొనసాగుతాడు.. మళ్లీ కలిసే అవకాశాలు ఉంటాయి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సమంత మరియు నాగ చైతన్యల అధ్యాయం ముగిసి పోయింది. మళ్లీ అది ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు. కనుక చర్చించుకోవడం అనేది వృదా అన్నట్లుగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు.