Naga Chaitanya : బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం బడా చిత్రాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రాధే శ్యామ్ గత కొన్నేళ్లుగా సెట్స్ పైనే ఉంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు డార్లింగ్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అటు బాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. మార్చి 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు.
సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుందని అందరు ఎదురు చూస్తుండగా, తాజాగా పెద్ద షాక్ ఇచ్చారు లాల్ సింగ్ చద్దాటీం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని ఏప్రిల్ 14, 2022న థియేటర్లలోకి తీసుకు రావాలని అనుకున్నారు. కాని ఈ చిత్రం పనులు పూర్తి కాని నేపథ్యంలో ఆగస్ట్ 11కి వాయిదా వేశారు.లాల్ సింగ్ చద్దా వస్తున్న నేపథ్యంలో అందరు ఆదిపురుష్ చిత్రం వాయిద పడ్డట్టేనని ఫిక్స్ అయ్యారు.
ఈ సినిమా తిరిగి ఎప్పుడు కొత్త విడుదల తేదీతో వస్తుందో అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా, లాల్ సింగ్ చద్దా చిత్రం టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ (2017) తీసిన అద్వైత్ చందన్ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత‍్వం వహించారు. ఈ సినిమా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. అమీర్ ఖాన్, కరీనా కపూర్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది ప్రొడక్షన్ బ్యానర్. ఇందులో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.