Naga Chaitanya – Sobhita Dhulipala : నాగ చైతన్య,శోభితల పెళ్లికి సమయం ఆసన్నమైంది.. కాపురం హైదరాబాదా, ముంబైనా?
Naga Chaitanya – Sobhita Dhulipala : అక్కినేని వారసుడు నాగ చైతన్య టాలీవుడ్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొని ఏవో మనస్పర్ధల వలన విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు సింగిల్ గా ఉన్న చైతూ శోభిత ప్రేమలో పడి ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక పెళ్లెప్పుడా అని అందరు ఎదురు చూస్తున్న సమయంలో అక్కినేని ఇంటికి […]
Naga Chaitanya – Sobhita Dhulipala : అక్కినేని వారసుడు నాగ చైతన్య టాలీవుడ్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొని ఏవో మనస్పర్ధల వలన విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు సింగిల్ గా ఉన్న చైతూ శోభిత ప్రేమలో పడి ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక పెళ్లెప్పుడా అని అందరు ఎదురు చూస్తున్న సమయంలో అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు మొదలుపెట్టారు. తాజాగా పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచటం ఫంక్షన్ వైజాగ్‌లోని శోభిత ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది.
Naga Chaitanya – Sobhita Dhulipala : టఫ్ టాస్క్..
విశాఖలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు అయ్యాయి. రుబ్బురోలులో గోధుమలను పసుపు కలిపి దంచడాన్నే ‘గోధుమ రాయి పసుపు దంచటం’ అంటారు. ఈ వేడుకతోనే శోభిత పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి. ఈ శుభసందర్భం సందర్భంగా కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి ఇళ్లను అరటి అరటి పండ్లు, పూలతో అలంకరిస్తారు. అలాగే, ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి శోభిత ఎంతో సంతోషంగా కనిపించింది. శోభిత ఈ వేడుకకు సింపుల్ సిల్క్ చీరను కట్టుకుంది. అలాగే, ఆకుపచ్చ, బంగారు, క్రీమ్, ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ పట్టుచీరను ఎంచుకుని సంప్రదాయబద్ధానికి అద్దంపట్టింది. భుజంపై నుంచి పల్లు కిందకు జారవిడిచింది. పై ఫొటోలో పెద్దల ఆశీర్వాదం తీసుకుంది శోభితా.
పసుపు కొట్టారు అంటే పెళ్లి పనులు మొదలయినట్టే దీంతో త్వరలోనే శోభిత – నాగచైతన్య పెళ్లి ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.వివాహం తర్వాత కొత్త జంట కాపురం ఎక్కడ పెడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. చైతన్య తెలుగు సినిమాలతో బిజీగా ఉంటాడు. కాబట్టి అతడు హైదరాబాద్ లోనే ఉండాలి. పైగా స్వస్థలం..ఇతర బిజినెస్ వ్యవహారాలు కూడా చైతన్య చూసుకోవాల్సి ఉంటుంది. కానీ శోభిత మాత్రం బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాలకు ప్రమోట్ అయిన నటి. అలాగే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇలా శోభిత కెరీర్ ఎక్కువగా ముంబైతో ముడిపడి ఉంది. చైతన్యను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెడితే? ఆమె ముంబైకి తిరగాల్సి ఉంటుంది. అలా కాకుండా ముంబైలో కాపురం పెడితే నాగచైతన్య హైదరాబాద్ కి తిరగాల్సి ఉంటుంది. మరి ఈ జోడి ఏం చేస్తారో చూడాలి.