Naga Chaitanya : నాగ చైత‌న్యకి విషెస్ తెలిపిన వెంక‌టేష్ కూతురు.. బావా అంటూ ఎంత ముద్దుగా పిలిచింది..!

Authored By Sam C | The Telugu News | Published on: March 5, 2022, 4:30 pm

Naga Chaitanya: అక్కినేని నాగార్జున ముద్దుల త‌న‌యుడు నాగ చైత‌న్య ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా మారాడు. స‌మంత నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత చైతూ ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. కేవలం హీరోయిజానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. న‌టుడిగానే కాకుండా వ్యాపార‌వేత్త‌గా రాణించాల‌ని భావిస్తున్నాడు నాగ చైత‌న్య‌. తండ్రి నాగార్జునలాగే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అక్కినేని ఫ్యామిలీ ఇప్పటి వరకు చాలా రకాల వ్యాపారాలు చేసినా ఫుడ్‌ బిజినెస్‌లోకి మాత్రం ఎంటర్‌ కాలేదు. కానీ చైతూ మాత్రం ఇదే రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

చై హైదరాబాద్‌లో ‘సోయు’ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు. త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ పెట్టి తెలిపారు. ఇది చూసిన విక్టరీ వెంకటేశ్ కూతురు ఆశ్రిత ..‘ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా’ అంటూ చైతూ పెట్టిన పోస్ట్‌కు రిప్లై ఇస్తూ విషెస్ తెలిపింది. ఇక నాగ చైతన్య అభిమానులు ఈ సందర్భంగా విషెస్ తెలుపుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ హీరోలు ఒక్కొక్క‌రు ఇలా ఫుడ్ బిజినెస్‌లోకి లేదంటే థియేట‌ర్ బిజినెస్‌లోకి అడుగుపెడుతుండ‌డం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

naga chaitanya starts food business

naga chaitanya starts food business

Naga Chaitanya : జోరు పెంచిన చైత‌న్య‌..

ఇక చైతూ విష‌యానికి వ‌స్తే గ‌త ఏడాది ల‌వ్ స్టోరీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన నాగ చైత‌న్య ఈ ఏడాది సంక్రాంతికి తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో వరుసగా సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు చైతు.దిల్ రాజు నిర్మాణంలో విక్రం కె కుమార్ దర్శకత్వంలో చైతు-రాశిఖన్నా జంటగా నటించిన ‘థాంక్యూ’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. మ‌రి కొన్ని ప్రాజెక్టులు కూడా చైతూ ఖాతాలో ఉన్నాయి. మొత్తానికి క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా గ‌డిపేందుకు చైతూ ప్లాన్ చేసుకుంటున్నాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp