Prabahs : పూజా పెదాల‌ను అందుకున్న ప్ర‌భాస్.. అన్నీ సీక్రెట్ రూమ్‌లోనే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabahs : పూజా పెదాల‌ను అందుకున్న ప్ర‌భాస్.. అన్నీ సీక్రెట్ రూమ్‌లోనే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 March 2022,1:30 pm

Prabahs: ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ సినిమా కోసం ప్ర‌పంచం అంతా ఎంతోఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో త‌ర్వాత ప్ర‌భాస్ సినిమా ఏది ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. ఈ క్ర‌మంలోనే రాధే శ్యామ్ సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన భారీ చిత్రం…’రాధే శ్యామ్’. ఇది పాన్ ఇండియా చిత్రం. ఇప్పటికే ముంబైలో ప్రమోషన్ చేశాడు ప్రభాస్. చెన్నైలో కూడా తమిళ వర్షన్ కోసం పబ్లిసిటీ మొదలు అయింది. కన్నడ, మలయాళ ప్రొమోషన్ కూడా జోరుగా సాగనుంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.

రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించి ఇంటర్వ్యూల మీద ఇంటర్వూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు చిత్ర బృందం. రాధేశ్యామ్ రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇక రొమాంటిక్ సినిమా అంటే కొద్దిగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం సహజమే. సినిమాలో పూజా తో ప్రభాస్ లిప్ లాక్ కూడా ఉండబోతున్నాయ‌ట‌. ఇప్పటివరకు డార్లింగ్ కిస్ సీన్లలో నటించింది లేదు.కాని తొలిసారి రాధే శ్యామ్ కోసం అది కూడా కానిచ్చాడ‌ట‌. ఆ స‌మ‌యంలో తాను ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొన్నాడో వివ‌రించాడు.

prabahs first time rmance with pooja hegde

prabahs first time rmance with pooja hegde

Prabahs : మొత్తానికి ప్ర‌భాస్ డేర్ చేశాడు..

నాకు అందరిముందు రొమాంటిక్ సన్నివేశాలు చేయాలంటే చాలా సిగ్గు.. ఇక ఈ సినిమా రొమాంటిక్ సన్నివేశాలతో కూడుకున్నది. దీంతో ఆ సన్నివేశాలు చేయాలన్నప్పుడు సెట్ లో ఎవరు లేకుండా ఒక ప్రైవేట్ స్పేస్ లో చేస్తానని చెప్పాను. అందుకు దర్శకుడు ఓకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సన్నివేశాలు కానిచ్చేశాను.. కొన్ని సన్నివేశాల్లో షర్టు లేకుండా చేసినప్పుడు కూడా ఒక ప్రైవేట్ ప్లేస్ లో చేశాను” అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి పూజాహెగ్డేతో ప్ర‌భాస్ ఫుల్ రొమాన్స్ చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇది ప్రేక్ష‌కులు ఏ రేంజ్‌లో రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది