Samantha : జీవితంలో ఇద్దరి మధ్య సమస్యలు వస్తుంటాయి.. గొడవపడ్డ మళ్లీ కలిసారంటూ సమంత పోస్ట్
Samantha: సమంత ఇటీవల కాలంలో ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సంబంధించి ఏ విషయమైన క్షణాలలో వైరల్ అవుతుంటుంది. ఇక సోషల్ మీడియాలో సమంత ఏ పోస్ట్ పెట్టని దానిపై నెటిజన్స్ కన్నేయడమే కాక తెగ వైరల్ చేస్తున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తాను అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని సమంత ఇటీవల తెలిపింది. 2021లో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాల తర్వాత తన జీవితంలో ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయని…
ఎందుకంటే తాను ఎంతో జాగ్రత్తగా రూపొందించుకున్న ప్రణాళికలన్నీ శిథిలమైపోయాయని చెప్పింది. భవిష్యత్తులో తనకు ఏదైతే సురక్షితంగా అనిపిస్తుందో దాన్ని స్వీకరిస్తానని తెలిపింది. సమంత హార్ట్ టచింగ్ మెసేజ్.. ప్రస్తుతం సోలో లైఫ్ కూడా చాలా హ్యాపీగా గడిపేస్తున్న సమంత తాజాగా తన క్యూట్ పెట్స్‌తో సరదగా ఆడుతూ అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సామ్ వర్కవుట్స్ చేస్తుంటే, తన పెట్స్ హాష్, సాషాలు గొడవ పడుతుంటాయి. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. జీవితంలో సిబ్లింగ్స్ మధ్య సమస్యలు వస్తుంటాయని నాకు తెలుసు అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చింది. అయితే గొడవ పడ్డా మళ్లీ ఒక్క నిమిషంలోనే అవి కలిసిపోయాయంటూ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

samantha interesting post viral
ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద చిత్రాలు చేస్తున్నారు. శాకుంతలం షూట్ పూర్తి అవ్వగా.. యశోద చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే సమంత కొన్ని వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక విజయ్ దేవరకొండ- శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోను ఈ ముద్దుగుమ్మ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కియారాని ముందుగా అనుకున్నా చివరికి సమంతని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఓసారి విజయ్, సమంత కలిసి మాహానటి అనే సినిమాలో నటించారు. అయితే అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే.