Home » Entertainment » Naga Chaitanya Talking About Samantha In Bangarraju Movie Promotions
Entertainment

Samantha : సమంత నాగ చైతన్య ల విడాకుల విషయమై ‘బంగార్రాజు’ ప్రమోషన్ లో ఏం జరిగింది?

Authored By
Himanshi
The Telugu News | Published on: January 10, 2022, 11:40 am
Advertisement

samantha  తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మరియు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌ లో ఉన్న సమంత అభిమానులందరికి మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులందరికి కూడా అతి పెద్ద షాకింగ్ విషయం 2021 లో జరిగింది. సమంత మరియు నాగ చైతన్యలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.. వారిని చూసి అంతా నేర్చుకోవాలి అంటూ అనుకుంటూ ఉండగా విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఇద్దరు చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. సామ్ మరియు నాగ చైతన్య ల మద్య అసలు ఏం జరిగింది.. వారు ఎందుకు విడి పోయారు అనే విషయాలు తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అది వారి వ్యక్తిగతం. కాని కొందరు మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పుకార్లు పుట్టిస్తూ.. షికార్లు చేస్తున్నారు.

Advertisement

నాగ చైతన్య బంగార్రాజు సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగార్జున కూడా ఈ సినిమాలో నటించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ రూపొందిన బంగర్రాజు సినిమా చిత్రీకరణ జెట్‌ స్పీడ్‌ లో ముగించి విడుదలకు సిద్దం చేయడం జరిగింది. నాగ చైతన్య మరియు సమంతల విషయం బంగార్రాజు ప్రమోషన్ సందర్బంగా చర్చ జరుగుతుంది. కొందరు జర్నలిస్ట్‌ లు నాగ చైతన్య తో సమంత గురించి మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని నాగ చైతన్య మాత్రం అలాంటి ప్రశ్నలు వచ్చిన సమయంలో చాలా సైలెంగ్‌ గానే ఉండి పోతుంది. ఆమె గురించి ఇప్పుడు తప్పుగా కాని.. ఒప్పుగా కాని ఏ విధంగా కూడా మాట్లాడేందుకు నాగ చైతన్య కు ఆసక్తి లేదని ఇటీవల ఆయన్ను బంగార్రాజు సినిమా కోసం ప్రమోషన్ చేసిన జర్నలిస్ట్‌ ఒకరు చెప్పడం జరిగింది.

Naga chaitanya talking about samantha in Bangarraju movie promotions

Advertisement

samantha  సమంత వ్యవహారంపై నాగ చైతన్య స్పందన?

విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ అయ్యింది. అంతే కాకుండా పలు సినిమాలను కమిట్‌ అవుతూ పుష్ప లో ఓ బోల్డ్‌ ఐటెం సాంగ్‌ చేసి కుమ్మేసింది. 15 కోట్ల మంది ఆ పాటను నెల రోజుల్లో చూశారు అంటే ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పాటలు మరియు వెబ్‌ సిరీస్ లు చేస్తున్న సమంత ను కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో నాగ చైతన్య ను ఆ విషయమై ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆ విషయాలపై నోరు విప్పేందుకు ఆసక్తి చూపించలేదు అంటూ రిపోర్టర్ ఒకరు పేర్కొన్నారు. మొత్తానికి కూల్‌ బాయ్ నాగ చైతన్య ఎప్పటిలాగే చాలా కూల్ గా ఏమాత్రం హడావుడి లేకుండా చిల్ అవుతూ సమంత విషయం లో మాత్రం మౌనం గా ఉంటూ వస్తున్నాడు. ఇద్దరిలో ఎవరో ఒకరు అయినా ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయమై నోరు విప్పాల్సిందే అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి