Naga Manikanta : నాగ మ‌ణికంఠ పొగిడాడా, తిట్టాడా అర్ధం కాలేదుగా.. ఏమ‌న్నా స్పీచ్ ఇచ్చాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Manikanta : నాగ మ‌ణికంఠ పొగిడాడా, తిట్టాడా అర్ధం కాలేదుగా.. ఏమ‌న్నా స్పీచ్ ఇచ్చాడా..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 November 2024,2:02 pm

ప్రధానాంశాలు:

  •  Naga Manikanta : నాగ మ‌ణికంఠ పొగిడాడా, తిట్టాడా అర్ధం కాలేదుగా.. ఏమ‌న్నా స్పీచ్ ఇచ్చాడా..!

Naga Manikanta : ప్రస్తుతం ఎక్కడ చూసిన బిగ్ బాస్ Bigg Boss Telugu 8  హవా నడుస్తుంది. ప్రతి ఇండస్ట్రీలో కూడా బిగ్ బాస్ వైబ్రేష‌న్స్ క‌నిపిస్తున్నాయి.. తెలుగులో వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత షో పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం విన్నర్ ట్రోపీ కోసం నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. ఇక ఈ సారి నామినేష‌న్ ప్ర‌క్రియ‌ని కాస్త డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశారు. పన్నెండో వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం (నవంబర్ 18) ప్రారంభమైంది. ఆరోజు సోనియా, బేబక్క, శేఖర్ బాషా వచ్చి నామినేట్ చేశారు.ఇక మంగ‌ళవారం కూడా నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌గా, ఈ సారి హౌజ్‌లోకి ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ వచ్చి నామినేట్ చేశారు. నాగ మణికంఠ వచ్చి మొదట నిఖిల్‌ను తర్వాత నబీల్‌ను నామినేట్ చేశాడు.

Naga Manikanta మోటీవేష‌న‌ల్ స్పీచ్..

నబీల్‌ను నామినేట్ చేసిన నాగ మణికంఠ “నువ్ స్ట్రాంగ్ ప్లేయర్‌వి కానీ, ఎక్కడ నామినేషన్స్‌లోకి వస్తావో అన్న భయం నీలో కనిపిస్తుంది. ఆ భయం వద్దు. అలాగే, నువ్వు ఎవరికోసం త్యాగాలు చేయకు. మొదటి నుంచి షేర్ లెక్క ఆడావ్. షేర్ లెక్కే ఉండు. లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత ట్రోఫీ పట్టుకుని బయటకురా. అదే నాకు కావాలి” అని చెప్పాడు. ఆడియెన్స్ నీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ల అంచనాలకు దగ్గరిగా రా. నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారు. నువ్ ఆడాల్సింది వాళ్లకోసం. నీ గేమ్ బయటకు తీయ్” అని నాగ మణికంఠ అన్నాడు. ఎవడు అడ్డు చెప్పిన వినకు. నువ్వు ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. త్యాగాలు ఎందుకు చేస్తున్నావ్.

Naga Manikanta నాగ మ‌ణికంఠ పొగిడాడా తిట్టాడా అర్ధం కాలేదుగా ఏమ‌న్నా స్పీచ్ ఇచ్చాడా

Naga Manikanta : నాగ మ‌ణికంఠ పొగిడాడా, తిట్టాడా అర్ధం కాలేదుగా.. ఏమ‌న్నా స్పీచ్ ఇచ్చాడా..!

నీ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే ముందు వాళ్లను ఆపు. నాది నేను చూసుకోగలనని చెప్పు. నీకు ఇబ్బంది అయితే పక్కకి పో అని చెప్పు. లేదు నాకూ అంత సత్తా లేదంటే బయటకు వచ్చేయ్. నువ్ హౌజ్‌లో ఉన్నావంటే నీ గురించే మాట్లాడుకోవాలి. టాస్క్ పేపర్ చదవడం కూడా యాడ్ అవుతుంది” అని నబీల్‌తో నాగ మణికంఠ చెప్పాడు.నువ్ చెప్పినవన్నీ తీసుకుంటా” అని నాగ మణికంఠతో అన్నాడు. దీని తర్వాత నిఖిల్ మధ్యలో “అమ్మతోడు.. ఇది నామినేషనో లేదంటే మోటివేషనో తెలియడం లేదు. అసలు డిఫెండింగ్ రావడం లేదు అవతల నుంచి” అని అన్నాడు. అనంతరం నాగ మణికంఠ హౌజ్ నుంచి వెళ్లడంతో ఇంటి సభ్యులకు టైటిల్ విన్నర్ రేస్‌లో ఎవరు ఉన్నారో క్లారిటీ వచ్చేసింది. హౌజ్ నుంచి వెళ్తూ కంటెస్టెంట్స్‌కు విన్నర్ రేస్‌లో ఎవరున్నారే విషయం చెప్పాడు. గౌతమ్, నిఖిల్, నబీల్ ముగ్గురు విన్నర్ రేస్‌లో ఉన్నారని నాగ మణికంఠ చెప్పాడు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది