Naga Vamsi : నా సినిమాని బ్యాన్ చేయండి.. రివ్యూల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసిన నాగవంశీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Vamsi : నా సినిమాని బ్యాన్ చేయండి.. రివ్యూల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసిన నాగవంశీ

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2025,6:10 pm

ప్రధానాంశాలు:

  •  Naga Vamsi : నా సినిమాని బ్యాన్ చేయండి.. రివ్యూల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసిన నాగవంశీ

Naga Vamsi : నిర్మాత  నాగ‌వంశీ టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాలు నిర్మించారు. తాజాగా ఆయ‌న మ్యాడ్ స్క్వేర్ అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చారు. ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో కనిపించేది. డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం ధాటికి ఎదురు నిలవలేదు. దీంతో బ్లాక్ బస్టర్ అనుకున్న చిత్రం సూపర్ హిట్ దగ్గర ఆగిపోయింది.

Naga Vamsi నా సినిమాని బ్యాన్ చేయండి రివ్యూల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసిన నాగవంశీ

Naga Vamsi : నా సినిమాని బ్యాన్ చేయండి.. రివ్యూల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసిన నాగవంశీ

Naga Vamsi ఆవేశం..

అంతకు ముందు లక్కీ భాస్కర్ టైంలోనూ , అమరన్ వల్ల ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది. గుంటూరు కారంని హనుమాన్ డామినేట్ చేయడం చూశాం. ఇవే కాదు గతంలో జెర్సికి కాంచన కాంపిటీషన్ వల్ల సీడెడ్ లో ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కాకపోవడం గురించి ఆయన చెప్పిన ఉదంతముంది. మ్యాడ్ స్క్వేర్ రూపంలో ఆ సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. రేసులో ఉన్న ఇతర మూడు సినిమాల మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఈ సినిమా దూసుకుపోతోంది.

అయితే మ్యాడ్ స్క్వేర్ బాగా ఆడుతున్నా కూడా దానిపై నెగెటివ్ రివ్యూలు రాయ‌డం, అలానే క‌లెక్ష‌న్స్ గురించి చెప్ప‌క‌పోవ‌డం ప‌ట్ల నాగ‌వంశీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తం డేటా నా ద‌గ్గ‌ర ఉంది. చూపిస్తా రండి. మీ రివ్యూల‌ని జ‌స్టిఫై కోసం సినిమాని తొక్కేస్తే ఎలా?అవసరం అయితే నా సినిమాలు బాన్ చేయండి, రివ్యూలు రాయకండి, సినిమా చూడకండి. నా సినిమాల‌ని ఎలా ప్ర‌మోట్ చేయాలో నాకు తెలుసంటూ నాగ‌వంశీ మండిప‌డ్డారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది