సంబరాలను సంపూర్ణం చేశాడు.. పవన్ కళ్యాణ్‌పై నాగబాబు కామెంట్స్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

సంబరాలను సంపూర్ణం చేశాడు.. పవన్ కళ్యాణ్‌పై నాగబాబు కామెంట్స్

మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఉండి తీరాల్సిందే. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ లేకపోయినా అది అసంపూర్ణమే. నిహారిక పెళ్లి సెలెబ్రేషన్స్‌లో ఇప్పటి వరకు అదే అసంతృప్తి అందరిలోనూ ఉంది. పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి సంబరాల్లో కనిపించకపోయే సరికి అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. నిహారిక పెళ్లి పనులు,సంబరాలు మొదలై వారం రోజులు అవుతున్నాయి. ఈ వేడుకల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. నిహారికను పెళ్లి కూతురిని చేసిన ఈవెంట్‌లో […]

 Authored By uday | The Telugu News | Updated on :8 December 2020,9:46 pm

మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఉండి తీరాల్సిందే. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ లేకపోయినా అది అసంపూర్ణమే. నిహారిక పెళ్లి సెలెబ్రేషన్స్‌లో ఇప్పటి వరకు అదే అసంతృప్తి అందరిలోనూ ఉంది. పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి సంబరాల్లో కనిపించకపోయే సరికి అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. నిహారిక పెళ్లి పనులు,సంబరాలు మొదలై వారం రోజులు అవుతున్నాయి. ఈ వేడుకల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు.

Nagababu about Pawan Kalyan At Niharika Wedding

Nagababu about Pawan Kalyan At Niharika Wedding

నిహారికను పెళ్లి కూతురిని చేసిన ఈవెంట్‌లో చిరంజీవి సందడి చేశాడు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వస్తాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ లేకపోయినా కూడా పిల్లలుంటారని అంతా భావించారు. కానీ ఆద్య, అకీరాలు కూడా కనపడలేదు. పైగా అన్నా లెజినోవా ఫ్యామిలీ కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఇక నేరుగా పెళ్లికే వెళ్తాడని అంతా ఫిక్స్ అయ్యాడు. చివరకు అదే నిజమైంది.

నేటి సాయంత్రం పవన్ కళ్యాణ్ తన పిల్లలు ఆద్య, అకీరా నందన్‌లతో కలిసి ఉదయ్ పూర్‌కు బయల్దేరాడు. ఇక ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్‌ను నాగబాబు దగ్గరుండి మరీ తీసుకెళ్లినట్టున్నాడు. పవన్ కళ్యాణ్‌ను ప్యాలెస్ లోపలికి తీసుకెళ్తున్నాడు. ఆ ఫోటోను షేర్ చేసిన నాగబాబు అదిరిపోయే కామెంట్ చేశాడు. ఈ మూమెంట్‌ను పరిపూర్ణం చేసేందుకు మా చివరి సంతోషం కూడా వచ్చేసిందంటూ తమ్ముడిపై ప్రేమను కురిపించాడు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది