Nagababu : ఎమ్మెల్సీ గా నాగబాబు ఏకగ్రీవం.. అన్నయ్య సంబరాలు
ప్రధానాంశాలు:
Nagababu : ఎమ్మెల్సీ గా నాగబాబు ఏకగ్రీవం.. అన్నయ్య సంబరాలు
Nagababu : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నేడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబుకు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన నాగబాబు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, జనసేన శ్రేణులు, మెగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Nagababu : ఎమ్మెల్సీ గా నాగబాబు ఏకగ్రీవం.. అన్నయ్య సంబరాలు
Nagababu తమ్ముడ్ని అభినందించిన అన్నయ్య
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగబాబు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ నాగబాబును పూలమాల వేసి సత్కరించడంతో పాటు ప్రత్యేకంగా ఖరీదైన పెన్‌ను బహుమతిగా అందజేశారు. చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ, తన తమ్ముడికి ఆత్మీయ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి పోస్టుకు భారీ స్పందన లభించింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లుగానే, ఇప్పుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అన్నయ్యను కలవడం అందరినీ ఆకట్టుకుంది. ఇది అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జనసేన బలోపేతానికి ఇది మరొక గొప్ప ముందడుగు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.