Nagababu : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగబాబు ట్వీట్.. బన్నీని ఉద్దేశించి చేశారా...?
Nagababu : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హడావిడి నిన్నటితో ముగిసింది. ఇక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీలో ఆసక్తికరమైన చర్చలు తెరపైకి వచ్చాయని చెప్పాలి. దానికి గల ముఖ్య కారణం మెగా బ్రదర్ నాగబాబు. ఇటీవల నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన ట్విట్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే నాగబాబు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటారనే విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ క్రమంలోనే నాగబాబు చేసిన ట్వీట్ కింద కామెంట్స్ సెక్షన్ లో ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాలపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసి ఉంటారని పలు వార్తలు వినిపిస్తున్నాయి. లేదా ఎస్.వి.ఎస్.ఎన్ వర్మను ఉద్దేశించి ఉంటుందని మరికొందరు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా…”మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయిన పరాయివాడే , మాతో నిజంగా నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే..!అంటూ రాస్కొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ రాజకీయ వర్గాలతో పాటు మెగా ఫ్యామిలీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పలువురు ఇది కచ్చితంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీలు అల్లు మరియు కొణిదల ఫ్యామిలీ మధ్య స్పష్టమైన విభజన రేఖను సృష్టించాయని తెలుస్తోంది.
అయితే పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే నాగబాబు కుటుంబంతో సహా మెగా ఫ్యామిలీ హీరోలు చాలామంది పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాలు చేశారు. పవన్ కళ్యాణ్ కోసం మెగా మేనల్లుళ్లు కూడా రంగంలోకి దిగారు. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడికి మద్దతుగా సోషల్ మీడియాలో వీడియో రూపంలో సందేశాన్ని ఇవ్వడం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని సూచించడం ఆసక్తికరంగా మారింది. అలాగే ఎన్నికల ప్రచారం చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లడం నిజంగా అందర్నీ ఆశ్చర్యం కలిగించింది.
Nagababu : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగబాబు ట్వీట్.. బన్నీని ఉద్దేశించి చేశారా…?
అంతేకాక నంద్యాలలో తన స్నేహితుడిని గెలిపించాల్సిందిగా బన్నీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారాలు చేశారు. దీంతో మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే అల్లు అర్జున్ మరోవైపు ఉన్నట్లుగా అప్పుడు ప్రచారాలు కొనసాగాయి. జన సైనికులు సైతం బన్నీపై నిప్పులు జరిగారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తర్వాత రాబోయే సినిమాపై ఈ ప్రభావం గట్టిగా పడుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నాగబాబు ఇటీవల సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ కచ్చితంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసి ఉంటారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై బన్నీ ఏమైనా స్పందిస్తారా వేచి చూడాలి.
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
This website uses cookies.