Nagarjuna : అక్కినేని నాగార్జున ముద్దుల తనయుడు నాగ చైతన్య స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే నాగ చైతన్యను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో తెరకెక్కిన జోష్ సినిమాతో వెండితెరకు గ్రాండ్‌గా పరిచయం చేశాడు. వాసువర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథ విన్నవెంటనే దిల్ రాజుకు ఒక్కసారిగా నాగార్జున శివ గుర్తుకు వచ్చిందట. దీంతో సినిమా చేసేందుకు అడుగులు వేశాడు. అయితే ఈ కథని రామ్ చరణ్‌కి వినిపించడంతో అతను ఆసక్తి చూపించాడట.
అయితే చిరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాడట. నాగబాబుని కూడా సంప్రదించమనగా, ఆయనని సంప్రదించగా, కొన్ని సందేహాలు వ్యక్తం చేశారట. చివరకు ఇదే కథను నాగార్జునకు చెప్పగా నాగ్ ఓకే చేయడంతో చైతు డెబ్యూ మూవీగా జోష్ వచ్చింది. అయితే ఇంతకంటే ముందు చైతును పరిచయం చేసేందుకు దిల్ రాజు నాగార్జున చుట్టూ తిరిగారట. కొత్తబంగారు లోకం సినిమాతో చైతును హీరోగా పరిచయం చేయాలన్నది దిల్ రాజు ప్లాన్. కాని నాగార్జున కాస్త యాక్షన్ సినిమా అయితే బాగుంటుందని ఆలోచించి చివరకు జోష్ చిత్రంతో తన కొడుకుని పరిచయం చేశాడు.
ఇక్కడే నాగ్ అంచనాలు తప్పాయి. దిల్ రాజు డెసిషన్ మేరకు వెళ్లి ఉంటే కొత్తబంగారు లోకం లాంటి సూపర్ హిట్ సినిమాతో యూత్‌కు పిచ్చగా కనెక్ట్ అయిపోతూ నాగచైతన్య ఎంట్రీ ఉండి ఉండేది. అయితే జోష్ లాంటి ప్లాప్ సినిమాతో చైతు ఎంట్రీ ఇచ్చాడు. అదే కొత్తబంగారు లోకం సినిమాతో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ చాలా రోజుల వరకు అదే సినిమా పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.