Nagarjuna : నాగార్జున చేసిన త‌ప్పుకు నాగ చైత‌న్య బ‌లి..!

Authored By Sam C | The Telugu News | Published on: July 2, 2022, 12:30 pm

Nagarjuna : అక్కినేని నాగార్జున ముద్దుల త‌న‌యుడు నాగ చైత‌న్య స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవ‌ల ల‌వ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. అయితే నాగ‌ చైత‌న్య‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు త‌న బ్యాన‌ర్లో తెర‌కెక్కిన జోష్ సినిమాతో వెండితెర‌కు గ్రాండ్‌గా ప‌రిచ‌యం చేశాడు. వాసువ‌ర్మ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ క‌థ విన్న‌వెంట‌నే దిల్ రాజుకు ఒక్క‌సారిగా నాగార్జున శివ గుర్తుకు వ‌చ్చింద‌ట‌. దీంతో సినిమా చేసేందుకు అడుగులు వేశాడు. అయితే ఈ క‌థ‌ని రామ్ చ‌ర‌ణ్‌కి వినిపించ‌డంతో అత‌ను ఆస‌క్తి చూపించాడ‌ట‌.

అయితే చిరు మాత్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడ‌ట‌. నాగ‌బాబుని కూడా సంప్ర‌దించ‌మ‌న‌గా, ఆయ‌నని సంప్ర‌దించ‌గా, కొన్ని సందేహాలు వ్య‌క్తం చేశార‌ట‌. చివ‌ర‌కు ఇదే క‌థ‌ను నాగార్జున‌కు చెప్ప‌గా నాగ్ ఓకే చేయ‌డంతో చైతు డెబ్యూ మూవీగా జోష్ వ‌చ్చింది. అయితే ఇంత‌కంటే ముందు చైతును ప‌రిచ‌యం చేసేందుకు దిల్ రాజు నాగార్జున చుట్టూ తిరిగార‌ట‌. కొత్త‌బంగారు లోకం సినిమాతో చైతును హీరోగా ప‌రిచ‌యం చేయాల‌న్న‌ది దిల్ రాజు ప్లాన్‌. కాని నాగార్జున కాస్త యాక్ష‌న్ సినిమా అయితే బాగుంటుంద‌ని ఆలోచించి చివ‌ర‌కు జోష్ చిత్రంతో త‌న కొడుకుని పరిచ‌యం చేశాడు.

nagarjuna did mistake in Naga Chaitanya movie

nagarjuna did mistake in Naga Chaitanya movie

Nagarjuna : నాగ్ త‌ప్పు..

ఇక్క‌డే నాగ్ అంచ‌నాలు త‌ప్పాయి. దిల్ రాజు డెసిష‌న్ మేర‌కు వెళ్లి ఉంటే కొత్త‌బంగారు లోకం లాంటి సూప‌ర్ హిట్ సినిమాతో యూత్‌కు పిచ్చ‌గా క‌నెక్ట్ అయిపోతూ నాగ‌చైత‌న్య ఎంట్రీ ఉండి ఉండేది. అయితే జోష్ లాంటి ప్లాప్ సినిమాతో చైతు ఎంట్రీ ఇచ్చాడు. అదే కొత్త‌బంగారు లోకం సినిమాతో హిట్ కొట్టిన వ‌రుణ్ సందేశ్ చాలా రోజుల వ‌ర‌కు అదే సినిమా పేరు చెప్పుకుని ఇండ‌స్ట్రీలో సెటిల్ అయిపోయాడు. నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp