Home » Entertainment » Pakka Commercial Movie First Day Collections
Entertainment

Pakka Commercial Movie First Day Collections : ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. ఎంత రాబ‌ట్టొచ్చంటే..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 2, 2022, 12:08 pm
Advertisement

Pakka Commercial : గోపీచంద్ ,రాశిఖన్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో GA2 బ్యానర్ పై బన్నీ వాసు, SKN కలిసి నిర్మించగా జులై 1న థియేటర్లలో రిలీజ్ కాగా, ఈ సినిమాకి మిక్స్‌డ్ వ‌చ్చింది. కామెడీలో కొత్త‌ద‌నం లేద‌ని రొటీన్‌గా అనిపించింద‌ని కొంద‌రు చెబుతున్నారు. మారుతి జోనర్ లోనే కామెడీకి యాక్షన్ కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. నైజాం – 6 కోట్లు, సీడెడ్ – 2.50 కోట్లు, ఆంధ్ర – 9 కోట్లు, మొత్తంగా తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.17.50 కోట్ల బిజినెస్ చేసింది.. రెస్టాఫ్ భారత్ – 0.50 కోట్లు, ఓవర్సీస్ – 1.20 కోట్లుగా ఉంది.

Advertisement

పక్కా కమర్షియల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ అనిపించుకోవాలంటే బాక్సాపీస్ దగ్గర 20 కోట్లు రాబట్టాలి. గోపీచంద్ గత సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ.మ‌రి సినిమాకి హిట్ టాక్ కూడా రాలేదు కాబ‌ట్టి మూవీ అంత వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మ‌నే చెప్పాలి. సినిమా ఫస్ట్ డే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ 15-20% రేంజ్ లో జరగగా ఈవినింగ్ షోల టైం కి 25% రేంజ్ లో నైట్ షోల బుకింగ్స్ 30% రేంజ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ యావరేజ్ గానే ఉన్నాయి.

Pakka Commercial Movie First Day Collections

Advertisement

Pakka Commercial Movie First Day Collections : క‌లెక్ష‌న్స్ ప‌రిస్థితి ఏంటి?

1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇంకా పెరిగితే 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. అంతకుమించి వస్తే కనుక సినిమా ఉన్నంతలో బాగానే ఓపెన్ అయింది అని చెప్పాలి. సినిమా సాధార‌ణంగా ఫ‌స్ట్ డేనే ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది. త‌ర్వాత త‌ర్వాత వ‌సూళ్లు త‌గ్గుతూ ఉంటాయి. గోపీచంద్ చివరిగా విడుదలైన సీటీమార్ మొదటి రోజు దాదాపు 4.1 కోట్లు వసూలు చేసింది మరియు ఇప్పుడు పక్కా కమర్షియల్ మొదటి రోజు దాదాపు 5.7 కోట్లు వసూలు చేసింది మరియు ఇది గోపీచంద్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఉన్న బెస్ట్ ఓపెనింగ్‌గా గుర్తించబడింది, అయినప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్‌కి చాలా అవసరం .

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి