
nagarjuna fire on adi reddy
Nagarjuna : బిగ్ బాస్ షో రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. గేమ్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో టాస్క్‌లు రంజుగా సాగుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు 6 టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉన్న ఎవిక్షన్ పాస్ ఆప్షన్‌ను ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎవిక్షన్ పాస్ కోసం జరిగే టాస్క్ కోసం ఓ గేమ్‌ను ఆడించగా, ఇందులో ఫైమా విజేతగా నిలిచి పాస్ దక్కించుకుంది. అయితే ఎవిక్షన్ పాస్ గేమ్ నుంచి తప్పుకొంటూ ఆదిరెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఈ విషయంపై నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో దారుణంగా క్లాస్ పీకారు.
ఇప్పటి వరకు ఈ రేంజ్‌లో ఎవరు క్లాస్ పీకలేదని తెలుస్తుంది. ఆదిరెడ్డి తీసుకొన్న నిర్ణయంపై హోస్ట్ నాగార్జున స్పందిస్తూ.. ఆది.. నీకు ఇనయా ఒక విషయం చెప్పింది కదా. బిగ్‌బాస్ ఆట ఇచ్చినప్పుడు ఆట ఆడాలి కానీ.. అడ్డమైన కారణాలతో ఆట ఆడకుండా ఉండటానికి చూసుకోవద్దు. ఒకవేళ నీవే కనుక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఆడి.. నీకు వచ్చి ఉంటే.. ఒక జెన్యూన్ కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లకుండా ఆపే ఛాన్స్ ఉండేది కదా. ఎవిక్షన్ పాస్ వేస్టా? ఆ పాస్ ఎవరికి వస్తే.. ఓట్లు రావా? నీవు ఏమైనా తోపువా? తురుమువా? గేమ్ విషయంలో ఎక్కువగా ఆలోచించి.. కారణాలు వెతికితే ఏమౌతుందో తెలుసా అంటూ గట్టిగా చురకలంటించాడు.
nagarjuna fire on adi reddy
ఇలాగే ఎక్కువ చేస్తే గీతూలాగే నువ్వు కూడా వెళ్ళిపోతావు అని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు నాగార్జున. దీంతో ఆదిరెడ్డి సైలెంట్ అయిపోయాడు. అలాగే శ్రీహాన్ కి కూడా చిన్న వార్నింగ్ ఇచ్చాడు నాగ్. శ్రీసత్యని ఒకలాగా, మిగిలిన కంటెస్టెంట్స్ ని ఒకలాగా చూస్తున్నావు,నీకు అర్ధమవుతుందా. తను నీకు ఫ్రెండ్ అయితే బయట చూసుకో ఇక్కడ హౌజ్ లో కాదు అంటూ కూల్ వార్నింగ్ ఇచ్చాడు. చివరగా కంటెస్టెంట్స్ కి మీమ్స్ గేమ్ అని పెట్టగా, ఇందులో కొన్ని పాపులర్ మీమ్ కౌంటర్ నేమ్స్ కార్డులు అక్కడ ఉంచి ఒక్కొక్కరిని ఒక్కో కార్డు ఎవరికి ఏది సూట్ అవుతుందో వాళ్ళకి ఇవ్వమని అన్నాడు. దీంతో ఎక్కువ మంది శ్రీహాన్‌కి ఇచ్చారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.