Nagarjuna : టాలీవుడ్ నవ మన్మథుడిగా ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నాగార్జున ఇప్పుడు తన తనయులకి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. చివరిగా నాగ చైతన్యతో కలిసి బంగార్రాజు సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే బంగార్రాజు చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నాగ్ అనేక విషయాలు చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఆయనకు వర్మకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. నాగార్జున వర్మ కాంబోలో అంతం, గోవింద గోవింద, ఆఫీసర్ వంటి చిత్రాలు వచ్చినప్పటికీ ‘శివ’ రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయాయి. నిజానికి ఈ ఇద్దరి కెరియర్‌లో ‘శివ’ని మించిన బిగ్గెస్ట్ హిట్ లేదనే చెప్పాలి.
అయితే పలువురు హీరోలు కూడా వర్మని పలు సందర్భాలలో విమర్శించిన కూడా నాగార్జున మాత్రం ఆయనని రాకింగ్ అనే అంటాడు. రీసెంట్‌గా ఆర్జీవీ అంటే ఎందుకంత ఇష్టమో చెప్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ‘బంగార్రాజు’. ‘‘ఆర్జీవీ నన్ను ఎంత ఇష్టపడతారో.. నేనూ అంతే ఇష్టపడతా.. ఎందుకంటే మా ఇద్దరి జర్నీ చాలా లాంగ్. నాతోనే మొదలైంది అతని జర్నీ. ఆర్జీవీ డైరెక్టర్ కాక ముందు నుంచి నాకు తెలుసు. ముందు అతను నా ఫ్రెండ్.. ఆ తరువాతే డైరెక్టర్. మా దారులు వేరైనా ఒకరంటే ఒకరికి అభిమానం. తాను ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు.
నాకు మనిషి, కథ నచ్చితేనే సినిమా చేస్తా. ఫస్ట్ కొందరు మనకు నచ్చరు. కాని తర్వాత వాళ్ల గురించి తెలుస్తుంది. అప్పుడు నచ్చుతారు. మనిషి నచ్చక రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి.. అలాంటి తప్పులు కూడా చేశాను’’ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. ప్రస్తుతం ఆయన ఘోస్ట్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.