Nagarjuna : సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. సీనియర్ భామలతో పాటు ఇప్పటి భామలు సైతం కాస్టింగ్ కౌచ్‌పై పలు రకాలుగా స్పందిస్తున్నారు. తమ అనుభవాలని తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఈ అమ్మడు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇషా కొప్పికర్ చాలా మందికి సుపరిచితం కాగా, ఆమె నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమతో రా సినిమాలో సైతం ఓ హీరోయిన్‌గా కాసేపు కనిపించింది.
90లలో ఇషా స్టార్ హీరోయిన్ గా రాణించి అభిమానులను సంపాదించుకున్నారు. ఇక 2009 లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరవాత సినిమాలకు దూరం అయ్యింది. కాగా నిఖిల్ హీరోగా నటించిన కేశవ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చదువుకుంటున్న క్రమంలోనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశాను. దీంతో నాకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ‘‘ఏక్ థా దిల్ థా ధడ్కన్’ ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యాను.
అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పాడు. ఇందుకోసం మీరు మొదట హీరోని కలవాలి అని చెప్పాడు. ఆ తర్వాత హీరోకి కాల్ చేస్తే ‘మీరు ఒంటరిగా రండి. ఏకాంతంగా కలుద్దాం. మీతో పాటు మీ స్టాప్ ఎవరు ఉండకూడదు’ అన్నాడని’’ చెప్పుకొచ్చింది. నా టాలెంట్ కు అవకాశాలు వస్తే చేస్తా లేదంటే లేదు అని చెప్పానని పేర్కొంది. ఆ తరవాత తనను ఆ ప్రాజెక్ట్ నుండి తీసివేశారు అని తెలిపింది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు తెలుగు, కన్నడ, తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. కాగా, మీటూ ఉద్యమంతో తమపై జరుగుతున్న లైంగిక నేరాలను మహిళలు వివిధ వేదికలపై ఒక్కొక్కరుగా బయట పెడుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు వ్యక్తిగత జీవితంలో వారు ఎదుర్కొన్న లైంగిక హింస గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నారు
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.